ప్రభాస్ (Prabhas)ను ఫ్యాన్స్, ఆడియన్స్ అందరూ 'రెబల్ స్టార్' అని పిలుస్తారు. కానీ, ఆయనకు 'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్' అని బిరుదు ఇచ్చారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). వాళ్ళిద్దరి కలయికలో 'స్పిరిట్' (Spirit Movie) రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. అవి పుకార్లు మాత్రమేనని చిత్ర బృందం కొట్టిపారేసింది. ఆ వివరాల్లోకి వెళితే...
వచ్చే ఏడాది మార్చి 5న సినిమా విడుదలSpirit Movie Release Date: 'స్పిరిట్' సినిమా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే మార్చి 5, 2027న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని, థియేటర్లలో ఈ సినిమా సందడి చేస్తుందని చిత్ర బృందం స్పష్టం చేసింది. సినిమా వాయిదా పడుతుందనే వార్తల్లో నిజం లేదని మేకర్స్ తెలిపారు. ప్లాన్ ప్రకారం షూటింగ్ జరుగుతోందని, రిలీజులో లేట్ ఏమీ లేదని పేర్కొన్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ లెవల్‌లో 8 భాషల్లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Also Read: SA Chandrasekhar - ఎవరీ ఎస్ఏ చంద్రశేఖర్? తండ్రితో దళపతి విజయ్‌తో గొడవలు, కోర్టు దావా ఏమిటి?
రణబీర్ కపూర్ హీరోగా 2023లో వచ్చిన 'యానిమల్' తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, నిర్మాత సంస్థలు టీ సిరీస్ & భద్రకాళి పిక్చర్స్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా నిర్మాతలు. ఇందులో ప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రి (Triptii Dimri) హీరోయిన్‌గా నటిస్తున్నారు. తొలుత హీరోయిన్ రోల్ దీపికా పదుకోన్ దగ్గరకు వెళ్ళింది. కానీ కొన్ని కండిషన్స్ వల్ల ఆమె ఆ రోల్ కోల్పోయింది. 'స్పిరిట్'లో ఇంకా వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్య దేశాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read: Palash Muchhal - కులం పేరుతో తిట్టాడు... స్మృతి మాజీ ప్రియుడు పలాష్ మీద అట్రాసిటీ కేసు
