Trivikram Srinivas Movie With NTR: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ మైథలాజికల్ మూవీ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇది పాన్ వరల్డ్ రేంజ్ మూవీ అంటూ భారీ హైప్ క్రియేట్ కాగా అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే అనౌన్స్‌మెంట్ వచ్చేస్తుందని అంతా భావించారు. అనూహ్యంగా బన్నీ అట్లీతో మూవీని అధికారికంగా ప్రకటించేశారు.

Continues below advertisement


త్రివిక్రమ్ లైనప్ మార్చేశారా?


ఈ క్రమంలో త్రివిక్రమ్ సందిగ్ధంలో పడిపోయారు. బన్నీ అట్లీతో మూవీ పూర్తైన తర్వాతే ఈ మూవీ చేసే ఛాన్స్ ఉండడంతో ఆ మైథలాజికల్ మూవీని ఎన్టీఆర్‌తో చేయాలని ప్లాన్ చేస్తున్నారట త్రివిక్రమ్. ఈ క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ స్టోరీని ఆయనకు వినిపించినట్లుగా ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ మైథలాజికల్ స్క్రిప్ట్ ఎన్టీఆర్‌కు కూడా కరెక్ట్‌గా సరిపోతుందని మాటల మాంత్రికుడు భావిస్తున్నారట. మరి అదే నిజమైతే మరో క్రేజీ కాంబో.. ఇంట్రెస్టింగ్ మైథలాజికల్‌తో త్వరలోనే మూవీ సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.


ఏది ముందు ఏది తర్వాత


'గుంటూరు కారం' మూవీ తర్వాత త్రివిక్రమ్ ఏడాదిన్నరగా తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పైనే దృష్టి సారించారు. బన్నీతో మూవీ అనౌన్స్‌మెంట్ వస్తుందని భావించగా దానికి బ్రేక్ పడడంతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో మూవీ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ ప్రాజెక్టుకు ముందే విక్టరీ వెంకటేష్‌తో ఓ మూవీ చేస్తారనే టాక్ వినిపించింది. ప్రస్తుతం రామ్ చరణ్.. బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' మూవీ చేస్తున్నారు.


ఇక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీతో బిజీగా ఉన్నారు. చరణ్‌తో త్రివిక్రమ్ వచ్చే ఏడాది మూవీని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వెంకీ, రామ్ చరణ్‌లతో మూవీ తర్వాతే ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇలా వరుస ప్రాజెక్టులు లైనప్‌లో పెడుతున్నారు త్రివిక్రమ్.


Also Read: బాలయ్య ‘డిక్టేటర్’, వెంకీ ‘చంటి’ TO రామ్ చరణ్ ‘మగధీర’, అజిల్ ‘బిల్లా’ వరకు - ఈ బుధవారం (జూన్ 11) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..


క్రేజీ కాంబో..


'అరవింద సమేత' తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలిసి పని చేస్తారనే టాక్ కొంతకాలం వినిపించింది. అదే 'గుంటూరు కారం' స్టోరీ అని దాన్నే మహేష్ బాబుతో తీశారనే టాక్ అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి బన్నీతో చేయాల్సిన ఈ మైథలాజికల్ ప్రాజెక్టు ఎన్టీఆర్‌తో చేస్తారనే వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది. 


అసలేంటీ ప్రాజెక్ట్..


మైథలాజికల్ అంటేనే ఓ ఇంట్రెస్టింగ్ జానర్. అలాంటిది మాటల మాంత్రికుడు, ఐకాన్ స్టార్ కాంబో అంటేనే ఆ క్రేజ్ ఊహించలేం. ఇక ఈ ప్రాజెక్ట్  విషయానికొస్తే.. నిర్మాత నాగవంశీ గతంలో పలు ఇంటర్వ్యూల్లో ఈ మూవీలో ఎలా ఉండబోతుందనే దానిపై చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. రామాయణం, మహాభారతం వంటి ప్రసిద్ధ ఇతిహాసాలపై కాకుండా.. ఎవరికీ తెలియని.. ఇంతవరకూ ఎవరూ చూడని.. పురాణాల్లో ఎవరికీ తెలియని ఓ దేవుని కథ ఈ స్టోరీ అని అన్నారు. ఈ మూవీని చూసి భారతదేశమే ఆశ్చర్యపోతుందంటూ చెప్పడంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. త్వరలోనే ఈ మూవీ స్టార్ హీరోతో సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.