Triptii Dimri about Animal Intimate Scene: నటీనటులకు పాపులారిటీ రావాలంటే ఒక్క సీన్, ఒక్క సాంగ్ అయినా చాలు.. అందుకే కొన్ని సినిమాల్లో హీరోలు, హీరోయిన్లతో సమానంగా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసిన వారికి కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. అదే విధంగా ‘యానిమల్’లో సెకండ్ హీరోయిన్‌గా నటించినందుకు తృప్తి దిమ్రికీ కూడా అదే రేంజ్‌లో పాపులారిటీ లభించింది. ముఖ్యంగా రణబీర్ కపూర్‌తో రష్మిక కంటే తృప్తి కెమిస్ట్రీనే బాగుందంటూ కొందరు ప్రేక్షకులు అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. అయితే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వడం కోసం తృప్తి కాస్త బోల్డ్‌గా కూడా నటించాల్సి వచ్చింది. ఈ సినిమాలోని ఇంటిమేట్ సీన్‌పై తన తల్లిదండ్రులతో జరిగిన డిస్కషన్ గురించి తాజాగా బయటపెట్టింది తృప్తి.


అలా ఆలోచించకూడదు..


‘యానిమల్’ చిత్రంలో తృప్తి దిమ్రీ పాత్ర నిడివి చాలా తక్కువ ఉంటుంది. కేవలం ఒక్క పాటలో మాత్రమే తను హైలెట్ అవుతుంది. అందులోనే తను బోల్డ్‌గా కూడా నటించాల్సి ఉంటుంది. ఈ విషయాన్నింటిపై తృప్తి తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించింది. ‘‘నాకు ఈ సినిమా చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇది చాలా చిన్న రోల్ అని సందీప్ సార్ నాకు ముందే చెప్పారు. కానీ క్యారెక్టర్ నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ప్రేక్షకులు ఏమనుకుంటారో అని ఆలోచించడం మొదలుపెడితే యాక్టర్లుగా మనం ఎప్పుడూ మనకు నచ్చింది చేయలేము. నా కంఫర్ట్ జోన్ నుండి బయటికి తీసుకొచ్చే పాత్రలు నేను చేయాలనుకుంటున్నాను. ఈ ఆఫర్ వచ్చిన తర్వాత నాకు ఎంతోమంది ఎన్నో సలహాలు ఇచ్చారు. కానీ ఫైనల్‌గా నేను నాకు అనిపించిందే చేశాను. నేను ఈ క్రమంలో కొన్ని తప్పులు కూడా చేసుండొచ్చు’’ అని తృప్తి చెప్పుకొచ్చింది.


పెద్ద డిస్కషన్ జరిగింది..


‘యానిమల్’లో ఒక సీన్‌లో రణబీర్ కపూర్‌తో కలిసి తృప్తి దిమ్రీ న్యూడ్‌గా నటించాల్సి వచ్చింది. దీనిపై తన తల్లిదండ్రుల స్పందన ఏంటో తృప్తి బయటపెట్టింది. ‘‘నా తల్లిదండ్రులు అయితే ఒక్కసారిగా షాకయ్యారు. ఆ సీన్ ఎంత ముఖ్యమో చెప్పడానికి నేను వారితో చాలా పెద్ద డిస్కషన్ కూడా పెట్టాను’’ అని గుర్తుచేసుకుంది. ఇప్పటికే ఈ సీన్‌పై తృప్తి చాలాసార్లు స్పందించింది. తను ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా కూడా అసలు ఆ సీన్ చేయడానికి ఎందుకు ఒప్పుకున్నారు? షూటింగ్ సమయంలో ఏం జరిగింది? లాంటి ప్రశ్నలే తనకు ఎదురవుతూ ఉన్నాయి. వాటన్నింటికీ ఓపికతో సమాధానం చెప్పుకుంటూ వెళ్లింది ఈ భామ.


చిన్న పాత్రతోనే క్రేజ్..


‘యానిమల్’ సినిమాలో చేసిన చిన్న పాత్ర తృప్తి కెరీర్‌నే మార్చేసింది. కార్తిక్ ఆర్యన్ సరసన ‘భూల్ భులయ్య 3’లో నటించే ఛాన్స్ కొట్టేసింది. అంతే కాకుండా విక్కీ కౌశల్ నటిస్తున్న ఒక చిత్రంలో కూడా హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే తృప్తి నటన ప్రతిభ ఏంటో బయటపెట్టే సినిమాలు వచ్చినా.. ‘యానిమల్’ మాత్రం ఇండస్ట్రీలో తన ఫేట్‌ను మార్చేసింది. ఇక ‘యానిమల్ పార్క్’లో కూడా తృప్తి ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. తన పాత్ర ‘యానిమల్’తోనే పూర్తవుతున్నట్టుగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చూపించలేదని, అందుకే సీక్వెల్‌లో కూడా తను ఉంటుందని ప్రేక్షకులు గట్టిగా నమ్ముతున్నారు.


Also Read: ‘యానిమల్ పార్క్’లో విలన్‌గా ఆ బాలీవుడ్ యంగ్ హీరో - బాబీ డియోల్‌ను మరిపిస్తాడా?