Tripti Dimri In Pushpa 2 : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'పుష్ప 2' సినిమా కోసం మూవీ లవర్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. 'పుష్ప' పార్ట్-1 తో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ టీం ఈసారి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు 'పుష్ప 2' ని గ్రాండ్ స్కేల్లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. అంతేకాదు సినిమాలో అల్లు అర్జున్ తో భారీ తారాగణం కూడా ఉండబోతోంది. ముఖ్యంగా ఈ సినిమా కోసం ఎక్కువగా బాలీవుడ్ తారలను తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 'పుష్ప 2' కోసం లేటెస్ట్ బాలీవుడ్ సెన్సేషన్ 'యానిమల్' మూవీ ఫేమ్ త్రిప్తి దిమ్రిని కూడా సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది.


'పుష్ప 2'లో 'యానిమల్' బ్యూటీ స్పెషల్ రోల్


'పుష్ప 2' సినిమాలో ఓ స్పెషల్ రోల్ ఉందట. ఆ రోల్ కోసం మూవీ టీం ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లను అనుకున్నారు. కానీ చివరికి ఈ రోల్ కోసం లేటెస్ట్ బాలీవుడ్ సెన్సేషన్ తృప్తి దిమ్రిని ఫైనల్ చేశారని తెలిసింది. 'యానిమల్' లో ఎలాంటి పాత్రలో అయితే కనిపించిందో సేమ్ 'పుష్ప 2' లో కూడా హీరోని ట్రాప్ చేసి విలన్స్ కి పట్టించే పాత్రలో త్రిప్తి దిమ్రి కనిపించనున్నట్లు చెబుతున్నారు. సినిమాలో ఆమె కనిపించేది కాసేపే అయినా 'పుష్ప 2' లో ఆమె 'యానిమల్' కి మించిన ప్రభావాన్ని చూపించబోతుందని ఇన్సైడ్ వర్గాల సమాచారం. ముఖ్యంగా బన్నీతో వచ్చే సీన్స్ సినిమాకే హైలెట్ గా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. అతి త్వరలోనే తృప్తి దిమ్రి 'పుష్ప 2' షూటింగ్లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది.


వరుస ఆఫర్స్ తో బిజీ బిజీ


'యానిమల్' సినిమాలో కనిపించింది కాసేపే అయినా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది తృప్తి దిమ్రి. ఈ సినిమాతో ఆమెకి పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరుస ఆఫర్స్ తో బిజీబిజీగా గడుపుతోంది. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లోనూ కొన్ని ఆఫర్స్ అందుకున్నట్లు సమాచారం. ఇప్పటికే బాలీవుడ్ లో 'విక్కీ వైద్య హా వో వాలా వీడియో', 'మేరే మెహబూబ్ మేరే సనన్' వంటి సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ తాజాగా 'భూల్ భులయ్యా', 'బ్యాడ్ న్యూస్' వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.


అల్లు అర్జున్ బర్త్ డే కి స్పెషల్ సర్ప్రైజ్


ప్రస్తుతం 'పుష్ప 2' షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాని ఆగస్టు 15 న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించినప్పటికీ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందనే రూమర్స్ ఏమాత్రం ఆగడం లేదు. అందుకే మూవీ టీం రూమర్స్ కి గట్టిగా చెక్ పెడుతూ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ సర్ప్రైజ్ ని ప్లాన్ చేస్తున్నారట. ఏప్రిల్ 8 న 'పుష్ప 2' నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


Also Read : సూర్య ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్?