'స్పిరిట్' సినిమా హీరోయిన్ గురించి రెండు మూడు రోజులుగా చర్చ జరుగుతోంది. డైలీ ఆరు గంటలు మాత్రమే షూటింగ్ చేస్తానని, 20 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఇవ్వాలని, తనతో పాటు స్టాఫ్ అందరికీ స్టార్ హోటల్ అకామిడేషన్ ఎరేంజ్ చేయాలని కండిషన్స్ పెట్టడంతో దీపికా పదుకోన్ (Deepika Padukone)ను సినిమా నుంచి తొలగించారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఆవిడ స్థానంలో ఎవరు వస్తారు? ప్రభాస్ జంటగా నటించే అవకాశం అందుకునే అందాల భామ ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానం లభించింది.
రుక్మిణి వసంత్ లేదు...మృణాల్ ఠాకూర్ కాదు!'స్పిరిట్'లో దీపికా పదుకోన్ నటించడం లేదని తెలిసిన తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు అందరూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఒక రిక్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు. హీరోయిన్ రోల్ కోసం మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)ను తీసుకోమని సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. అయితే... ఇప్పుడు ఆ అమ్మాయి హీరోయిన్ కాదని అర్థమైంది.
మృణాల్ ఠాకూర్ తర్వాత 'స్పిరిట్' సినిమాలో హీరోయిన్ అవకాశం రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కు దక్కిందని ప్రచారం జరిగింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సరసన 'డ్రాగన్' సినిమాలో నటిస్తున్న అమ్మాయిని ప్రభాస్ జంటగా ఎంపిక చేశారని కథనాలు వచ్చాయి. అయితే ఆ అమ్మాయి కూడా సినిమాలో లేదని స్పష్టం చేశారు సందీప్ రెడ్డి వంగా.
ప్రభాస్ జంటగా తృప్తి...'యానిమల్' బాబీ 2కి మరో ఛాన్స్!రణబీర్ కపూర్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన హిందీ సినిమా 'యానిమల్'. అందులో రష్మిక హీరోయిన్. అయితే సినిమా విడుదల తర్వాత నేషనల్ క్రష్ కంటే తృప్తి డిమ్రీ ఎక్కువ హైలైట్ అయింది. ఆవిడను అందరూ బాబి 2 అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. రణబీర్ కపూర్, తృప్తి డిమ్రీ బెడ్ రూమ్ సీన్ మీద చర్చ జరిగింది సోషల్ మీడియాలో వీడియో విపరీతంగా చక్కర్లు కొట్టింది.
Also Read: టాలీవుడ్ 'కింగ్ పిన్'కు పవన్ కళ్యాణ్ చెక్‌మేట్... చిన్న గూగ్లీకి హడల్... దెబ్బకు సెట్టయ్యారా?
'యానిమల్'కు ముందు, 'యానిమల్' తర్వాత అన్నట్టు తృప్తి డిమ్రీ కెరీర్ సాగింది. హిందీలో ఆవిడకు వరుస పెట్టి అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మరోసారి నటించే అవకాశం ఆ అమ్మాయికి దక్కింది. ప్రభాస్ జంటగా 'స్పిరిట్' సినిమాలో నటించనుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఒక్కరే అని, అది కూడా తృప్తి అని కన్ఫర్మ్ చేశారు.
Also Read: మెగా ఫ్యామిలీని దూరం చేసుకుంటున్న దిల్ రాజు? తెర వెనక కుట్రలా... ఇండస్ట్రీలో ఏం జరుగుతోందా?
'స్పిరిట్'లో పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు ప్రభాస్. ఇది ఒక డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని గతంలోనే సందీప్ రెడ్డి వంగా తెలిపారు. ఇప్పటి వరకు ప్రభాస్‌ను ఎవరూ చూపించని విధంగా చూపిస్తూ ఒక యాక్షన్ మూవీ చేస్తున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు పూర్తి అయ్యాక ఇది సెట్స్ మీదకు వెళుతుంది. ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడు మరే సినిమా చేయవద్దని, లుక్ కంటిన్యుటీ విషయంలో ఇబ్బందులు రాకుండా మందు జాగ్రత్తగా హీరోకి దర్శకుడు కండిషన్లు పెట్టారట.