Niharika Konidela Reaction About iBOMMA Ravi Case : iBOMMA రవి... గత కొద్ది రోజులుగా అటు సోషల్ మీడియా ఇటు ఇండస్ట్రీలో ఎక్కడ విన్నా అదే పేరు. పైరసీ మూవీస్‌తో ఇండస్ట్రీ పెద్దలకు, పోలీసులకు చుక్కలు చూపించిన నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. తాజాగా హీరోయిన్, ప్రముఖ నిర్మాత నిహారిక కొణిదెల తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పందించారు. 

Continues below advertisement


ఎవరిదో చోరీ చేసి పంచేస్తారా?


తాను చిన్నప్పటి నుంచీ సినిమాను హానెస్ట్‌గానే చూశానని... అది ఇంగ్లీష్ సినిమా అయినా పైరసీ మూవీ చూడలేదని అన్నారు నిహారిక. సోషల్ మీడియాలో 'ఐబొమ్మ రవిని' హీరోగా, రాబిన్ హుడ్‌గా పోల్చడాన్ని తప్పుపట్టారు. 'నా లైఫ్‌లో నేను ఒక్కసారి కూడా పైరసీ మూవీ చూడలేదు. ఎవరైనా పైరసీ సినిమాలు చూద్దామన్నా అలాంటివి నేను ఎప్పుడూ ఎంకరేజ్ చేయలేదు. మా నాన్న సినిమాలు ఎక్కడో పైరసీ చేస్తుంటే మా అన్న ఆ షాపులకు వెళ్లి మరీ వాటిని పోలీసులకు పట్టించాడు.' అని అన్నారు.


అది సామాజిక న్యాయమా?


వేరే ఎవరిదో ప్రాపర్టీ దొంగిలించి ఇతరులకు ఇచ్చేయడం సామాజిక న్యాయమా? అని ప్రశ్నించారు. 'మనం ఓ హానెస్ట్‌గా మూవీ చేస్తే అది అందరికీ ఈక్వెల్‌గా అందాలి. చూస్తే సినిమా అందరూ ఫ్రీగా చూడాలి. లేకుంటే అందరూ డబ్బులు కట్టాలి. ఈక్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దీనిపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. వేరే ఎవరిదో సామాను. నువ్వు సామాజిక న్యాయం చేయకూడదు కదా?' అంటూ చెప్పారు.


Also Read : రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - ఎందులో చూడొచ్చంటే?


సినిమా లేకుంటే చచ్చిపోతామా?


'సినిమా అనేది ఓ చాయిస్. మనం ఫుడ్ లేకున్నా, నీరు లేకున్నా చచ్చిపోతాం. అడ్వెంచర్ పార్క్ లేకుంటే మీరు మేమూ చచ్చిపోతామా? సినిమా అనేది చాయిస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. నేను తీసేవాళ్లని కాదు చూసే వాళ్లని అంటున్నా. ఎవరికి నచ్చితే వాళ్లు చూడొచ్చు. మీ ఎకనమికల్ స్టేటస్ మీరు చూసుకోండి. ఒకవేళ సినిమా టికెట్ రేట్స్ ఎక్కువ ఉన్నాయని మీకు అనిపిస్తే థియేటర్లకు వెళ్లొద్దు. దానికి బదులు ఇంకేదైనా చేయండి. కొన్నిసార్లు టికెట్ రేట్ రూ.వెయ్యి ఉంటే నాకు కూడా అనిపిస్తుంది. నాకు అవసరం లేదు అనుకుంటే నేను ఆ మూవీ చూడను.


అలా కాకుండా ఒకరి సినిమాపై అన్ అఫీషియల్‌గా వచ్చి నేను న్యాయం చేస్తానంటే నువ్వు ఎవరు బాస్ అసలు. నువ్వు ఎందుకు చేయాలి? నువ్వు పోలీస్‌వి కాదు. లా అండ్ ఆర్డర్ అసలే కాదు. అలాంటిది నువ్వెందుకు ఏదో రాబిన్ హుడ్‌లా మారాలి? ఎవరిపైనా కోపంతో నువ్వు సాటి వాళ్ల పొట్ట కొట్టొచ్చా?' అంటూ ప్రశ్నించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా సరిగ్గా చెప్పారంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఒకరి సినిమాని పైరసీ చేసి ఇండస్ట్రీకి నష్టం కలిగించడం కరెక్ట్ కాదని అంటున్నారు. మరికొందరు మాత్రం 'iBOMMA రవి' చేసింది కరెక్టే అంటూ తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు.