మే 28న యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా హీరోగా నటించిన 'బ్లాస్ట్' తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'బ్లాస్ట్' రివ్యూస్ బావున్నాయి. దీనితో పాటు మలయాళ యాక్షన్ ఫిల్మ్ 'కాటాలన్' కూడా థియేటర్లలోకి వచ్చింది. అయితే... ఆల్రెడీ థియేటర్లలో ఉన్న సినిమాలకు ఈ రెండూ ఎటువంటి పోటీ ఇవ్వలేదు. బాక్సాఫీస్ బరిలో సూర్య 'కరుప్పు', మోహన్ లాల్ 'దృశ్యం 3' డామినేషన్ కనిపించింది. మే 28న ఏ సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయి? అనేది చూస్తే...

Continues below advertisement

Blast Box Office Collection Day 1: అర్జున్ 'బ్లాస్ట్' సినిమాకు మొదటి రోజు ఇండియాలో కోటి రూపాయల నెట్ కలెక్షన్ వచ్చింది. గ్రాస్ చూస్తే... రూ. 1.15 కోట్లు. మొత్తం 1022 షోలు పడ్డాయి. ఓపెనింగ్ డే ఆక్యుపెన్సీ 26 శాతం ఉంది. హిట్ టాక్ రావడంతో శుక్రవారం నుంచి ఆక్యుపెన్సీ పెరిగే అవకాశాలు ఉన్నాయి.

Kattalan Box Office Collection Dat 1: మలయాళ హీరో ఆంటోనీ వర్గీస్ పాన్ ఇండియా రిలీజ్ 'కాటాలన్'కు మొదటి రోజు 3.40 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ వచ్చింది. గ్రాస్ చూస్తే... రూ. 3.91 కోట్లు. ఈ మూవీ నెట్ కలెక్షన్స్‌లో మలయాళ వెర్షన్ (రూ. 2.85 కోట్లు) ఎక్కువ కలెక్ట్ చేసింది. కన్నడలో రెండు లక్షలు, తమిళంలో ఐదు లక్షల నెట్ రాగా... తెలుగులో 20 లక్షలు, హిందీలో 28 లక్షల నెట్ వచ్చింది.

Continues below advertisement

Also Read: KD The Devil OTT Release Date - 'కేడీ ది డెవిల్' ఓటీటీ రిలీజ్ డేట్... కన్నడ కాంట్రవర్షియల్ సినిమాను ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?

'కాటాలన్'లో సునీల్ విలన్ రోల్ చేశారు. కబీర్ దుహాన్ సింగ్ మరొక విలన్. 'కాటాలన్' రివ్యూస్ చూస్తే ఏవరేజ్ ఫిల్మ్ అని క్రిటిక్స్ చెప్పారు. మరి, శుక్రవారం కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి.

Drishyam 3 Collections: మే 28వ తేదీ... గురువారం కూడా బాక్సాఫీస్ బరిలో మోహన్ లాల్ సినిమా 'దృశ్యం 3' జోరు కనిపించింది. ఇండియాలో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ రూ. 6.50 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. ఓవర్సీస్‌లో రూ. 5.50 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. దాంతో ఓవర్సీస్ గ్రాస్ 103.50 కోట్లకు, వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 197.91 కోట్లకు చేరుకుంది. మే 29న 200 కోట్ల గ్రాస్ మార్క్ చేరుకుంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Photo Gallery: Anasuya In Short Dress - షార్ట్స్‌లో అనసూయ... స్టైలిష్‌గా బ్యూటిఫుల్ లేడీ

Karuppu Collections: మే 28వ తేదీతో సూర్య 'కరుప్పు' (తెలుగులో 'వీరభద్రుడు') థియేటర్లలోకి వచ్చి రెండు వారాలు. అయినా సరే మంచి కలెక్షన్స్ రాబడుతోంది. గురువారం ఈ సినిమా ఇండియాలో రూ. 5.70 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 88 లక్షల నెట్ రాగా... తమిళంలో రూ. 4.10 కోట్లు, కర్ణాటక నుంచి 50 లక్షలు, కేరళలో 18 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో 4 లక్షల నెట్ వచ్చింది. దాంతో వరల్డ్ వైడ్ గ్రాస్ 267 కోట్లకు చేరుకుంది. శుక్రవారం థియేటర్లలోకి రెజీనా, అనుపమ పరమేశ్వరన్, విరాజ్ అశ్విన్ నటించిన 'మరీచిక' వస్తోంది. ఆ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Also ReadSara Khan Controversial Post On EID - బక్రీద్‌కు జంతు బలి ఎందుకు? సారా ఖాన్ పోస్టుపై గరమ్ గరమ్