ఈ ఏడాది 'దసరా' సినిమాతో పాన్ ఇండియా హిట్ సొంతం చేసుకున్న న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం 'హాయ్ నాన్న'(Hi Nanna) అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శౌర్యువ్ అనే నూతన దర్శకుడు ఈ మూవీతో వెండితెరకి అరంగేట్రం చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాని డిసెంబర్ 21 న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించి మ్యూజికల్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేస్తూ 'సమయమా'(Samayama) ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ పాట మంచి రెస్పాన్స్ ని అందుకుంది.


నాని తన సినిమాలను ప్రమోట్ చేయడంలో అందరికంటే ముందు ఉంటాడు. అక్టోబర్లో విడుదలయ్య సినిమాలే ఇంకా వాటి ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయలేదు. కానీడిసెంబర్ లో తన సినిమా రిలీజ్ ఉన్నా, అప్పుడే 'హాయ్ నాన్న' ప్రమోషన్స్ ని మొదలు పెట్టేసారు నాని. దీన్నిబట్టి ఈ ఏడాది చివర్లో మరో హిట్టు కొట్టాలని ఎంతో కసిగా ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఇదిలా ఉంటే 'హాయ్ నాన్న' తర్వాత నాని ఎవరితో సినిమా చేస్తాడనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే నాని కోసం ఏకంగా ముగ్గురు దర్శకులు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. వారిలో మొదటగా వివేక్ ఆత్రేయతో ఓ క్రైమ్ కామెడీ మూవీని చేయాల్సి ఉంది. ఆపై దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా కూడా ఉన్నట్లు సమాచారం.


ఇక ఈమధ్య తమిళ దర్శకుడు శిబి చక్రవర్తి తో కూడా నాని సినిమా చేస్తున్నాడని వార్తలు వినిపించాయి. తమిళంలో శివ కార్తికేయన్ తో 'డాన్'(Don) సినిమా తీసి భారీ సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు తన నెక్స్ట్ మూవీని నానితో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ముగ్గురిలో నాని తన నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తాడు? ఏ సినిమాని ముందు అనౌన్స్ చేస్తాడు? అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. నిజానికి నాని వివేక్ ఆత్రేయ మూవీని వినాయక చవితి సందర్భంగా అనౌన్స్ చేయాలని భావించినప్పటికీ అది జరగలేదు. అటు 'దసరా' తర్వాత డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా సైలెంట్ అయిపోయాడు. కాబట్టి ప్రస్తుతానికి ఈ దర్శకుడుతో నాని సినిమా ఉండే అవకాశం లేదు. మరి 'హాయ్ నాన్న' తర్వాత నాని ఎవరితో సినిమా చేస్తాడు అనేది చూడాలి.


'హాయ్ నాన్న' విషయానికొస్తే.. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. నానికి జోడిగా 'సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా నటిస్తోంది. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, K.S మూర్తి, విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తుండగా, ప్రవీణ్ ఆంథోని ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.


Also Read : క్లైమాక్స్ చూస్తే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతా - ‘7/జీ బృందావన కాలనీ’పై హీరో రవికృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు



Join Us on Telegram: https://t.me/abpdesamofficial