This Week Theatrical Telugu Releases Movies List : ఈ హాట్ సమ్మర్‌లో కూల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ఏప్రిల్ మూడో వారం చిన్న సినిమాలు రెడీ అవుతున్నాయి. విలేజ్ కామెడీ ఎంటర్టైనర్స్ నుంచీ హారర్ మూవీస్ వరకూ థియేటర్లలో సందడి చేయనున్నాయి. మరి ఆ మూవీస్ ఏంటో ఓసారి చూస్తే...
విలేజ్ ఎంటర్టైనర్ 'తిమ్మరాాజుపల్లి TV'
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా వస్తోన్న ఫస్ట్ మూవీ 'తిమ్మరాజు పల్లి TV'. 90s బ్యాక్ డ్రాప్‌లో అప్పటి తరాన్ని గుర్తు చేసేలా ఓ అందమైన విలేజ్ కామెడీ ఎంటర్టైనర్. న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో దాదాపు అందరూ కొత్త వాళ్లతోనే ఈ మూవీని తీశారు. సాయితేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా వెండితెరకు పరిచయం అవుతుండగా... వి.మునిరాజు డైరెక్టర్. ఈ నెల 17న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
'పాపం ప్రతాప్' ఏమైంది?
డిఫరెంట్ స్టోరీస్ సెలక్ట్ చేసుకుంటూ తనదైన నటనతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న హీరో తిరువీర్. ఆయన ప్రధాన పాత్రలో, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ విలేజ్ లవ్ ఎంటర్టైనర్ పాపం ప్రతాప్. ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ జంట జీవితంలో పెళ్లైన 4 రోజులకే ఇబ్బందులు వస్తే ఏం జరిగింది? అనేదే మూవీ స్టోరీ అని తెలుస్తోంది. ఎస్పీ దుర్గా నరేశ్ దర్శకత్వం వహించగా... అజయ్ ఘోష్, రఘుబాబు, ప్రసాద్ బెహర తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ నెల 17న సినిమా రిలీజ్ కానుంది.
Also Read : కండలు తిరిగిన దేహంతో ఎన్టీఆర్ - మ్యాన్ ఆఫ్ మాసెస్ న్యూ బీస్ట్ లుక్ చూశారా!
నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్'
యంగ్ హీరో నాగశౌర్య లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'బ్యాడ్ బాయ్ కార్తీక్'. రామ్ దేశినా దర్శకత్వం వహించిన ఈ మూవీలో విధి హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే, సముద్రఖని, సీనియర్ నరేశ్, సాయి కుమార్, మైమ్ గోపి, వెన్నెల కిశోర్, శ్రీదేవి విజయ్ కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ నెల 17న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తీరం చెంత 'తెరచాప'
సముద్ర తీరం చెంతనున్న ఓ ఊరి కథ 'తెరచాప'గా ప్రేక్షకుల ముందుకు రానుంది. నవీన్‌రాజ్ శంకరపు, పూజా సుహాసిని, శ్రీలు ప్రధాన పాత్రల్లో నటించగా... రాజీవ్ కనకాల, రాకీ, నాగ మహేశ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఏప్రిల్ 17నే ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
బాలీవుడ్ 'భూత్ బంగ్లా'
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ 'భూత్ బంగ్లా'. ప్రియదర్శన్ తెరకెక్కించిన ఈ మూవీలో వామికా గబ్బీ, టబు హీరోయిన్లు. ఈ నెల 16న పెయిడ్ ప్రీమియర్లు ప్రదర్శించనుండగా... 17న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
టొవినో థామస్ 'పళ్లి చట్టంబి'
మలయాళ స్టార్ టొవినో థామస్, కయాదు లోహర్ జంటగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'పళ్లి చట్టంబి'. డిజో జోస్ ఆంటోని దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్ రాఘవన్, సుధీర్, బాబురాజ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. మలయాళంతో పాటు తెలుగులోనూ ఈ నెల 15న సినిమా రిలీజ్ కానుంది.
