NTR's New Transformation Beast Look For Dragon Movie : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prasanth Neel) కాంబోలో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'డ్రాగన్' (వర్కింగ్ టైటిల్) కోసం మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రీసెంట్‌గా ఎన్టీఆర్ లుక్‌పై అసంతృప్తి కారణంగా షూటింగ్‌కు బ్రేక్ పడిందంటూ ప్రచారం సాగగా... దాన్ని నిర్మాతలు ఖండించారు. 

ఎన్టీఆర్ బీస్ట్ లుక్

ఈ క్రమంలో ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్ ఇచ్చేలా ఎన్టీఆర్ న్యూ లుక్ వైరల్ అవుతోంది. కండలు తిరిగిన దేహంతో బీస్ట్ మోడ్‌లో ఉన్న లుక్ అదిరిపోయింది. విశాలమైన భుజాలు, సన్నని నడుముతో... క్లాసిక్ బ్యాక్ డబుల్ బైసెప్స్ ఫోజులో ట్రాన్సఫర్మేషన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. పవర్ ఫుల్ యాక్షన్ రోల్ కోసం ఎన్టీఆర్ ప్రత్యేక శిక్షణ, సూపర్ డైట్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోను షేర్ చేసిన ఎన్టీఆర్... 'బిల్ట్... నాట్ బాట్' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్రెండీ లుక్ వైరల్ అవుతోంది.

Also Read : డెకాయిట్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - అడివి శేష్ మాస్ జాతర కంటిన్యూ అవుతోందిగా...

ఎన్టీఆర్ న్యూ లుక్ కోసమే షూటింగ్ బ్రేక్ పడిందన్న సోషల్ మీడియా ప్రచారంపై మేకర్స్ వెంటనే క్లారిటీ ఇచ్చారు. ఆ రూమర్స్‌లో ఎలాంటి నిజం లేదని... రెగ్యులర్ సన్నాహాల బ్రేక్ మినహా షూటింగ్ అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని కన్ఫర్మ్ చేశారు. ఈ క్రమంలో త్వరలోనే న్యూ షెడ్యూల్ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

మొదటి నుంచీ ఈ మూవీ కోసం ఎన్టీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. గతంలోనూ ఆయన లుక్స్ వైరల్ అయ్యాయి. రీసెంట్‌గా జోర్డాన్‌లో షూటింగ్ కంప్లీట్ కాగా... శంషాబాద్ సమీపంలోని ఓ ఆలయంలో దాదాపు వారం రోజుల పాటు షూటింగ్ జరిగినట్లు సమాచారం. ఎన్టీఆర్‌పై యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేసినట్లు తెలుస్తోంది. మరో షెడ్యూల్ కోసం భారీ సెట్ నిర్మిస్తున్నారు.

టొవినో ప్లేస్‌లో...

ఈ మూవీలో టొవినో థామస్ విలన్ రోల్ చేస్తున్నారనే ప్రచారంపై రీసెంట్‌గానే క్లారిటీ వచ్చింది. డేట్స్ అడ్జెస్ట్ కాని కారణంగా తాను ఈ మూవీలో నటించడం లేదంటూ టొవినో కన్ఫర్మ్ చేశారు. ఆయన స్థానంలో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్‌ను (Shahid Kapoor) తీసుకోవచ్చంటూ ప్రచారం సాగుతోంది. ఈ రోల్ కోసం ఆయన్ను సంప్రదించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. 

పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.  మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో మూవీ నిర్మిస్తుండగా... జూన్ 25న సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అప్డేట్స్ రానున్నాయి.