Star Hero Dhanush Story Behind The Success: సినిమా ఇండస్ట్రీలో లక్కు, అభినయం మాత్రమే సరిపోదు. లుక్స్ కూడా చాలా ముఖ్యం. లేదంటే స్క్రీన్‌పై మెరిసే ఛాన్సులు తగ్గడమే కాదు, దారుణంగా ట్రోలింగ్‌కు గురి కావాల్సి ఉంటుంది. ఇప్పుడంటే సోషల్ మీడియా వాడకం పెరిగిపోయింది కాబట్టి డైరెక్ట్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇది వరకు మాత్రం ఎగతాళి చేసేవారు. అలా లుక్స్, కలర్ విషయంలో ఆటో డ్రైవర్ అంటూ వెక్కిరింపులు ఎదుర్కొన్న ఓ నటుడు ఇప్పుడు స్టార్ హీరోగా సౌత్ ను ఏలుతున్నాడు. సాధారణంగా అందంగా లేకపోతే కనీసం అవకాశాలు కూడా ఇవ్వరు. కానీ ఈ హీరో మాత్రం తన యాక్టింగ్‌తో విమర్శకుల నోళ్లు మూయించారు. అంతేకాదు ఇప్పుడు కోట్లాది మంది అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా, 150 కోట్ల విలువైన ఇంట్లో రాజులా బ్రతుకుతున్నాడు. అంతేనా వందల కోట్లకు వారసుడు కూడా. ఆ హీరో మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ ధనుష్.
19 ఏళ్లకే సినిమా ఎంట్రీ ధనుష్ తండ్రి కస్తూరి రాజా నటుడు, దర్శకుడు. కాబట్టి చిన్నప్పటి నుంచే ఇంట్లో సినిమా వాతావరణం ఎక్కువగా ఉండేది. ఇక ధనుష్ తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ కోలీవుడ్‌లోకి హీరోగా అడుగుపెట్టాడు. 2002లో వచ్చిన 'తుళ్ళువాదో ఇలామై' చిత్రంతో వెండితెరపై హీరోగా అరంగేట్రం చేశాడు. ఈ చిత్రానికి ధనుష్ తండ్రి దర్శకత్వం వహించగా, అప్పుడు ఆయన వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే.
ఆటో డ్రైవర్ అంటూ ఎగతాళి అయితే స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉండడంతో ఇండస్ట్రీలోకి ఈజీగానే అడుగుపెట్టాడు ధనుష్. కానీ సర్వైవ్ అవ్వడం మాత్రం అంత ఈజీ కాలేదు. లుక్స్, కలర్ కారణంగా ధనుష్ అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫలితంగా ఆయన ఎమోషనల్ అయిన సంగర్భాలు కూడా ఉన్నాయి. 2015లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ధనుష్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. 2003లో విడుదలైన తన 'కాదల్ కొండేన్' చిత్రం గురించి మాట్లాడుతూ... ఈ సినిమా షూటింగ్ సమయంలో తన లుక్స్‌ను ఎగతాళి చేశారని, తనపై జోక్స్ వేసేవారని ధనుష్ చెప్పాడు. చిత్రబృందం తనను ఆటో డ్రైవర్ అని పిలిచేవారట. దీంతో ధనుష్ తన కారులో కూర్చుని గంటల తరబడి ఏడ్చాడు.
అలా ఒకప్పుడు తన లుక్స్ విషయంలో ఎమోషనల్‌గా డ్యామేజ్ అయ్యే విధమైన అవమానాలను ఎదుర్కొన్న ధనుష్, నేడు దక్షిణాదిలోనే అత్యంత సక్సెస్ ఫుల్ నటుల్లో ఒకడు. భారీ స్థాయిలో ఫాలోయింగ్‌తో పాటు ధనుష్ తన యాక్టింగ్ స్కిల్స్‌తో స్టార్‌డం, రూ.వందల కోట్ల ఆస్తులను కూడా సంపాదించాడు. ప్రస్తుతం ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.230 కోట్లుగా ఉంటుందని సమాచారం. అలాగే చెన్నైలోని పోయెస్ గార్డెన్ అనే పాష్ ఏరియాలో ఆయనకు రూ.150 కోట్ల విలువైన ఇల్లు కూడా ఉంది. అలా అవమానాలను దాటుకుని, ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని లుక్స్ మాత్రమే ముఖ్యం కాదని నిరూపించారు. ఎంతోమంది అప్ కమింగ్ నటీనటులకు ఆదర్శంగా నిలిచారు ధనుష్.