The Raja Saab Director Maruthi Comments On Prabhas and NTR: 'ది రాజా సాబ్' విడుదలకు సమయం దగ్గర పడే కొలదీ దర్శకుడు మారుతి వార్తల్లో వ్యక్తిగా మారారు. సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆయన బాగా తీశారని చాలా మంది అప్రిషియేట్ చేశారు. అంతకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ఎమోషనల్ కావడం కూడా వైరల్ అయ్యింది. అది పక్కన పెడితే... ఆ వేడుకలో ''ప్రభాస్ లాంటి మీడియం రేంజ్ హీరోని 'బాహుబలి'తో రాజమౌళి పాన్ ఇండియా స్టార్ చేశారు'' అని మారుతి కామెంట్ చేశారు. ఆ మాటలపై కొంత మంది అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలుగు మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చారు మారుతి.
నేను ఎమోషనల్ అయ్యాను... మాట దొర్లింది!'ది రాజా సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోని తన స్పీచ్‌లో 'మీడియం రేంజ్ హీరో' అనే పదం వాడటం వల్ల వచ్చిన వివాదంపై చిత్ర దర్శకుడు మారుతి స్పందిస్తూ, అది కేవలం మాట దొర్లడం వల్ల జరిగిందని వివరించారు. తాను ఆ సమయంలో చాలా ఎమోషనల్‌గా ఉండటంతో పాటు ప్రభాస్ గారి గురించి చాలా గొప్పగా చెప్పాలనే తాపత్రయం, ఆరాటంలో తెలియకుండా ఆ పదం వాడేశానని ఆయన ఒప్పుకొన్నారు. తాను ఆ మాట వాడటం తప్పేనని అంగీకరించారు.
ప్రభాస్ గారు 'మిర్చి' సినిమా చేసే సమయానికి సూపర్ స్టార్ అని, ఆ విషయాన్ని నొక్కి చెప్పే క్రమంలోనే పొరపాటు జరిగిందని మారుతి వివరించారు. అంతే కాదు... ప్రభాస్ గారిని తాను రాముడిలా చూస్తానని, తన దృష్టిలో ఆయన దేవుడితో సమానం అని, ఆయన రాముడు అయితే తాను హనుమంతుడు అని మారుతి అన్నారు. ప్రభాస్ లాంటి పెద్ద హీరో గురించి మాట్లాడేటప్పుడు మరింత గౌరవం ఇవ్వాలని చూసే క్రమంలో తెలియకుండానే ఇటువంటి తప్పులు జరుగుతాయని ఆ సమయంలో తాను కొంచెం ఎమోషనల్ బ్రేక్ డౌన్ అవ్వడం వల్లే అలా జరిగిందని మారుతి చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ వివాదానికి సైతం చెక్ పెట్టిన మారుతి!'ది రాజా సాబ్' సినిమా ఫస్ట్ సాంగ్ విడుదల సమయంలోనూ మారుతి చెప్పిన ఓ పదం వివాదానికి కారణమైంది. కాలర్ ఎగరేయడం ఎందుకని ఆయన అనడంతో ఎన్టీఆర్ (Jr NTR)ను అవమానించారని ఫ్యాన్స్ కొందరు ట్రోల్ చేశారు. తన ప్రతి సినిమా వేడుకలో ఎన్టీఆర్ కాలర్ ఎగరేయడం కామన్. 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అయితే డబుల్ కాలర్ ఎగరేశారు. ఆ వివాదంపై కూడా ఆయన స్పందించారు.
తనకు ఎవరినీ తక్కువ చేయాలనే ఉద్దేశం లేదని మారుతి స్పష్టం చేశారు. తనకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని, ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా తనకు లేదని మారుతి తెలిపారు. అసలు ఎన్టీఆర్ గారికి, ఆ రోజు మాట్లాడిన అంశాలకు అసలు సంబంధమే లేదని ఆయన వివరించారు.
Also Read: ప్రభాస్ 'రాజా సాబ్' కాదు... జనవరి 2026లో ఈ హాలీవుడ్ సినిమాలూ థియేటర్లలోకి వస్తున్నాయ్