Vijaykanth In The Greatest of All Time: ఈరోజుల్లో ప్రతీ రంగంలో టెక్నాలజీ అనేది విపరీతంగా ఉపయోగిస్తున్నారు. ఏఐతోనే అన్ని క్రియేట్ చేసేస్తున్నారు. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్.. సింగర్స్‌ను క్రియేట్ చేశారు మేకర్స్. తాజాగా ఆ టెక్నాలజీతో చనిపోయిన యాక్టర్‌ను కూడా రీక్రియేట్ చేయాలని కోలీవుడ్ మూవీ మేకర్స్ సన్నాహాలు మొదలుపెట్టారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. ప్రస్తుతం పాలిటిక్స్‌కు కాస్త పాజ్ ఇచ్చి ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (The GOAT) మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇక ఆ మూవీకి మరింత హైప్ క్రియేట్ చేయడం కోసం ఇటీవల మరణించిన సీనియర్ యాక్టర్‌ను ఏఐతో రీక్రియేట్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు.
ఏఐ టెక్నాలజీతో..
విజయ్, వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది గోట్’ (The GOAT) కోసం హీరో ఫ్యాన్స్ అంతా తెగ ఎదురుచూస్తున్నారు. విజయ్ పాలిటిక్స్‌లోకి ఎంటర్ అయ్యే ముందు లాస్ట్ సెకండ్ మూవీ ఇదే అని వారంతా ఫీల్ అవుతూనే.. ఇది కచ్చితంగా తన కెరీర్‌లో ల్యాండ్ మార్క్ సినిమా అవుతుందని అభిమానులు అనుకుంటున్నారు. రాజకీయ పార్టీని స్థాపించిన తర్వాత కూడా పాలిటిక్స్‌కు పాజ్ ఇచ్చి.. ఎట్టి పరిస్థితిల్లోనూ ముందుగా ప్రకటించినట్టుగానే సెప్టెంబర్ 5న విడుదల చేయాలని విజయ్ అనుకుంటున్నారు. మీనాక్షి చౌదరీ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. తాజాగా మృతిచెందిన విజయ్‌కాంత్‌ను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ద్వారా మూవీలో భాగం చేయాలని సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్.
దర్శకుడి రిక్వెస్ట్..
విజయ్‌కాంత్, విజయ్ చాలా క్లోజ్. అందుకే విజయ్ హీరోగా నటిస్తున్న ‘ది గోట్’లో విజయ్‌కాంత్‌ను ఏఐ ద్వారా రీక్రియేట్ చేస్తే ప్రేక్షకులు హ్యాపీగా ఫీలవుతారని మేకర్స్ అనుకుంటున్నారట. అయితే విజయ్‌కాంత్‌ను ఏఐ ద్వారా రీక్రియేట్ చేస్తున్న విషయాన్ని స్వయంగా తన భార్య ప్రేమలతనే ప్రకటించారు. ‘ది గోట్’లో ఒక కీలకమైన సీన్‌లో విజయ్, విజయ్‌కాంత్ కలిసి కనిపించనున్నారని ఆమె తెలిపారు. ముందుగా అలా చేయడం తనకు ఇష్టం లేదని, కానీ దర్శకుడు వెంకట్ ప్రభు చాలాసార్లు తన సమ్మతం కోసం ఇంటికి వచ్చారని ప్రేమలత బయటపెట్టారు. తమిళంలో సైన్స్ ఫిక్షన్ సినిమాలు తెరకెక్కించడంతో గుర్తింపు తెచ్చుకున్న వెంకట్ ప్రభు.. విజయ్‌కాంత్ ఏఐను ఎలా ఉపయోగిస్తాడా అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.
డబుల్ రోల్..
అర్చన కల్పతి, కల్పతి ఎస్ అఘోరమ్, కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేశ్ కలిసి సంయుక్తంగా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ను నిర్మిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది ఈ సినిమా. జయరామ్, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, మైక్ మోహన్, వైభవ్, ప్రేమ్గీ, అజయ్ రాజ్, అరవింద్ ఆకాశ్ వంటి నటీనటులు ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా.. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలయిన ‘ది గోట్’ పోస్టర్స్ ద్వారా విజయ్ డబుల్ రోల్ అని, తను ఒక సైనికుడని తెలుస్తోంది.
Also Read: కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ - ఏపీ, తెలంగాణలో నయా రికార్డ్స్, ప్రభాస్ డబుల్ సెంచరీ కొడతాడా?