యంగ్ అండ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) వెరీ బిజీ. ఒక వైపు దర్శకత్వం వహిస్తున్న 'ఈ నగరానికి ఏమైంది 2' పనులు చూస్తూ... మరొక వైపు హీరోగా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ఆయన ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్న సినిమా 'క్రేజీ కల్యాణం' (Crazy Kalyanam Movie).

Continues below advertisement

'క్రేజీ కల్యాణం'లో బాల్ రాజ్Tharun Bhascker Role In Crazy Kalyanam Movie: హోలీ సందర్భంగా 'క్రేజీ కల్యాణం'లో బాల్ రాజ్ పాత్రలో తరుణ్ భాస్కర్ నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఆయన క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఆ లుక్ చూస్తే... సూపర్ మ్యాన్ తరహాలో తరుణ్ భాస్కర్ మంచి జోష్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమా పెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథతో రూపొందుతోందని, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరణ చేశామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read: Virosh Reception Photos: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు

Continues below advertisement

'క్రేజీ కల్యాణం'లో నరేష్ విజయకృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, 'రాజ్ వెడ్స్ రాంబాయి' ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 2గా బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. బద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తున్నారు.

Also ReadShreyasi Sen - ABPDesam SmartED Conclave2026: సినిమాల్లో చూపించే ఆ రెండూ తప్పే - డాక్టర్ & యాక్టర్ శ్రేయాసి సేన్ ఇంటర్వ్యూ

Crazy Kalyanam Movie Cast: నరేష్ విజయకృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి తదితరులు నటించిన ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్: జె గాయత్రి దేవి, కళా దర్శకుడు: సాయి కదిర, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీపాల్ మాచర్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అఖిల్ సాయి శ్రీమూర్తి, నృత్య దర్శకత్వం: ఈశ్వర్ పెంటి, యాక్షన్: 'డ్రాగన్' ప్రకాష్, సాహిత్యం: గోరటి వెంకన్న - చైతన్య ప్రసాద్ - కాసర్ల శ్యామ్, ఎడిటర్: శ్రావణ్ కటికనేని, ఛాయాగ్రహణం: శ్యామ్ దూపాటి, సంగీతం: సురేష్ బొబ్బిలి, స్క్రీన్ ప్లే: శ్రీనివాస రవీంద్ర (ఎంఎస్ఆర్), నిర్మాత: బూసం జగన్ మెహన్ రెడ్డి, కథ - కథనం - మాటలు - దర్శకత్వం: బద్రప్ప గాజుల.

Also Read: Vijay Divorce Alimony: విడాకుల కోసం విజయ్ దూకుడు... భరణంగా 250 కోట్లు ఇవ్వడానికి రెడీ?