Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
Naanaa Hyraanaa Game Changer Song: జస్ట్ ఒక చిన్న టీజర్ విడుదల చేయడం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సాంగ్ ఈ మధ్యకాలంలో ఏదైనా ఉందంటే అది 'గేమ్ చేంజర్'లోని నానా హైరానా అని చెప్పాలేమో!?

నానా హైరానా... ఫుల్ సాంగ్ విడుదల కాకముందే బ్లాక్ బస్టర్ కొట్టిన పాట. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ చేంజర్ సినిమాలోని మూడో పాట (Game Changer Third Single) ఇది. జస్ట్ చిన్న టీజర్ విడుదల చేశారు అంతే! అది ఆడియన్స్ ప్లే లిస్టులోకి ఫుల్లుగా ఎక్కేసింది.
నానా హైరానా... ఎవరి నోట విన్నా!
'గేమ్ చేంజర్' నుంచి ఇప్పటి వరకు విడుదలైన పాటలు గమనిస్తే... ఫస్ట్ సాంగ్ 'జరగండి జరగండి' మొదట లీక్ అయ్యింది. ఆ తర్వాత ఒరిజినల్ వెర్షన్ వచ్చింది. సెకండ్ సాంగ్ 'రా మచ్చా మచ్చా'. ఆ రెండు పాటలకూ ఎక్కడో కొంత నెగెటివిటీ (యాంటీ ఫ్యాన్స్ నుంచి కావచ్చు) లేదంటే మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ, ఇప్పుడు మూడో పాటకు అటువంటి ప్రమాదం లేదు. ఇది ఇన్స్టంట్ చార్ట్ బస్టర్.
Naanaa Hyraanaa Song: 'గేమ్ చేంజర్'లో మూడో పాట 'నానా హైరానా...'ను శ్రేయా ఘోషల్, కార్తీక్ పాడారు. ఈ సాంగ్ స్పెషాలిటీ వివరిస్తూ చిన్న వీడియో చేశారు. అందులో సాంగ్ బిట్ చిన్నది వినిపించారు. శ్రేయా ఘోషల్ వాయిస్, కార్తీక్ వాయిస్, ఆ ట్యూన్... ఇన్స్టంట్ హిట్ అయ్యాయి. ఎవరి నోట విన్నా ఈ పాట స్టార్టింగ్ లిరిక్స్ వినబడుతున్నాయి. చిన్న బిట్ విడుదల తర్వాత ఇలా ఉంటే... ఫుల్ సాంగ్ వచ్చాక ఎలా ఉంటుందో!
తమన్ మెలోడీ కొట్టిన ప్రతిసారీ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కొట్టారు. అందులోనూ తమన్ సంగీతంలో శ్రేయా ఘోషల్ సాంగ్ అంటే కచ్చితంగా బ్లాక్ బస్టరే. అందులో మరో సందేహం లేదు. ఇప్పుడీ 'నానా హైరానా'తో అది మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ సాంగ్ షూటింగ్ కోసమే 15 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం.
Also Read: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
సినిమాలో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి?
How Many Songs In Game Changer Movie: 'గేమ్ చేంజర్' సినిమాలో టోటల్ 5 సాంగ్స్ ఉన్నాయని తెలిసింది. మూడో పాటను నవంబర్ నెలాఖరున విడుదల చేస్తున్నారు. నాలుగో పాట డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఐదో సాంగ్ ఎప్పుడు వస్తుందో? సంక్రాంతికి సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో జోరు పెరుగుతోంది. రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తున్నారు.
Also Read: అమెరికా అమ్మాయితో సుబ్బరాజు పెళ్లైపోయిందోచ్... 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నటుడు
రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటించిన 'గేమ్ చేంజర్'లో తెలుగు అమ్మాయి అంజలి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ వరకు చరణ్ జంటగా సందడి చేయనున్నారు. ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, జయరామ్, ప్రియదర్శి తదితరులు ఇతర కీలక పాత్రలు చేసిన చిత్రమిది. సంక్రాంతి సందర్భంగా జనవరి 10న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది.