సంగీత దర్శకుడు తమన్ (Thaman)కు 'ఎన్.బి.కె తమన్' అని గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) స్వయంగా నామకరణం చేశారు. బాలయ్య సినిమా అంటే చాలు తమన్ పూనకం వచ్చినట్లు రీ రికార్డింగ్ చేస్తారని ప్రేక్షకులు అందరూ చెప్పే మాట. ఇప్పుడు 'అఖండ 2' టీజర్ (Akhanda 2 Teaser) విడుదలకు కొన్ని గంటల ముందు దాని మీద హైప్ పెంచేశారు తమన్.
థగ థగ తాండవం... బాలయ్య సంభవం!జూన్ 10న బాలకృష్ణ పుట్టిన రోజు. బర్త్ డే సందర్భంగా నందమూరి అభిమానులు అందరికీ కొన్ని గంటల ముందు గిఫ్ట్ ఇవ్వాలని 'అఖండ 2' టీం డిసైడ్ అయ్యింది. అదే 'అఖండ 2' టీజర్. తమన్ దాని గురించి 'థగ థగ తాండవం' అంటూ ట్వీట్ చేశారు. సాయంత్రం ఆరు గంటలకు మాట్లాడుకుందామని చెప్పారు. దాంతో అభిమానులలో అంచనాలు మరింత పెరిగాయి.
బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కలయికలో నాలుగో చిత్రం ఇది. 'సింహ', 'లెజెండ్', 'అఖండ' హ్యాట్రిక్ సక్సెస్ తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం ఈ సినిమాతో శ్రీకారం చుట్టారు. 14 రీల్స్ పతాకం మీద రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ రోజు (జూన్ 9వ తేదీ) సాయంత్రం 6.03 గంటలకు టీజర్ విడుదల కానుంది. బాలకృష్ణ సరసన సంయుక్త కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నారు. పలువురు నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.