Thalapathy Vijay's Jana Nayagan Release Date Locked : కోలీవుడ్ స్టార్, ఇళయ దళపతి విజయ్ లాస్ట్ మూవీ జన నాయగన్ రిలీజ్‌పై సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. పలు తేదీలు ప్రచారంలోకి వచ్చినా మూవీ టీం నుంచి అయితే ఎలాంటి క్లారిటీ రాలేదు. రీసెంట్‌గా తమిళనాడు ఎన్నికల పూర్తి కాగా... తాజాగా మరో డేట్ వైరల్ అవుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

Continues below advertisement

రిలీజ్ ఎప్పుడంటే?

మే 4న తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత మే 8న 'జన నాయగన్' రిలీజ్ కానుందంటూ తమిళ సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అప్పటికి సెన్సార్ పనులు కూడా పూర్తవుతాయని... పొలిటికల్ హీట్ తర్వాత కలెక్షన్స్ బాగుంటాయని టీం భావిస్తోందట. అందుకే ఆ తేదీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రావొచ్చని తెలుస్తోంది.

Continues below advertisement

పైరసీ చూసిన ఎలక్షన్ స్టాఫ్

ఈ నెల 23న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల టైంలో విధులు నిర్వహిస్తుండగా... ఓ వ్యక్తి 'జన నాయగన్' మూవీ పైరసీ చూశాడు. అన్నా వర్సిటీలో నిఘా కోసం యువరాజ్ అనే వ్యక్తిని కాంట్రాక్ట్ బేసిస్‌పై సీసీ టీవీ హెడ్‌గా నియమించారు. కీలక విభాగంలో విధులు నిర్వహిస్తున్న అతను... ఎన్నికలు జరుగుతున్న టైంలో 'జన నాయగన్' లీకైన వెర్షన్ చూశాడు. అంతే కాకుండా తాను మూవీ చూస్తున్నట్లుగా ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

తన ఐడెంటిటీ కార్డు కూడా షేర్ చేశాడు. ఈ విషయం ఎన్నికల అధికారుల దృష్టికి వెళ్లడంతో అతనిపై చర్యలు చేపట్టారు. ఎన్నికల విధుల్లో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా పైరసీని ప్రోత్సహించేలా వ్యవహరించినందుకు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Also Read : ఏడాది తర్వాత ఓటీటీలోకి సంపూర్ణేష్ బాబు మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

వరుస షాక్స్

ఈ సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన మూవీ సెన్సార్ వివాదాలతో వాయిదా పడింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో డివిజినల్ బెంచ్‌కు రివ్యూ కోసం మూవీని పంపారు. సెన్సార్ క్లియరెన్స్ కోసం ప్రయత్నాలు జరుగుతున్న టైంలో ఫుల్ మూవీ ఆన్ లైన్‌లో లీక్ కావడం అటు మూవీ టీంతో పాటు ఇటు ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా... ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఎడిటింగ్ టైంలోనే లీక్ అయ్యిందనే వార్తల నేపథ్యంలో... 'సదరన్ ఇండియా ఫిల్మ్ ఎఢిటర్స్ అసోసియేషన్' ఎడిటర్ ప్రదీప్ ఇ రాఘవ్‌ను కొన్నాళ్ల పాటు సస్పెండ్ చేసింది.

విజయ్ లాస్ట్ మూవీ కావడంతో జన నాయగన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా... పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. అలాగే, మమితా బైజు కీలక పాత్ర పోషించారు. వీరితో పాటే బాబీ డియోల్, ప్రియమణి, నరైన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించగా... KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట కె నారాయణ నిర్మించారు.