Chiranjeevi Bobby Mega 158 Movie Shooting Updates : మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ మూవీ మెగా 158 ప్రాజెక్ట్ నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ కోసం చిరు లుక్ టెస్ట్ కంప్లీట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోను చిత్ర నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

Continues below advertisement

త్వరలోనే పూజా కార్యక్రమాలతో మూవీ ప్రారంభం కానుండగా... ముహూర్తం, షూట్ అప్డేట్స్ వెల్లడిస్తామని తెలిపారు మేకర్స్. 'మరో వేడుక కోసం స్క్రీన్ సెట్.' అంటూ షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. 

Also Read : చరణ్ పెద్ది, నాని ది ప్యారడైజ్‌ మూవీస్‌కు లీకుల షాక్ - ఐటమ్ సాంగ్ To యాక్షన్ సీక్వెన్స్!

రూమర్స్‌కు చెక్

ఒక్క పోస్టుతో చిత్ర నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ రూమర్స్‌కు చెక్ పెట్టేసింది. నిజానికి ఈ నెల 20నే పూజా కార్యక్రమాలతో మూవీ ప్రారంభం కానుందనే ప్రచారం సాగింది. అయితే, జన నాయగన్ లీక్ వ్యవహారం, టాకిస్ వాయిదా వంటి అంశాలతో నిర్మాణ సంస్థ ఇబ్బందుల్లో ఉందని... నిర్మాతలు మారతారనే రూమర్స్ వచ్చాయి. అందుకే మూవీ ప్రారంభం కూడా పోస్ట్ పోన్ అయ్యిందనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత టీం నుంచి ఎలాంటి అప్డేట్స్ రాలేదు.

దీంతో మూవీ ఎప్పుడు ప్రారంభం అవుతుందా? అనే సస్పెన్స్ అందరిలోనూ నెలకొంది. తాజా అప్డేట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మే ఫస్ట్ వీక్‌లోనే పూజా కార్యక్రమాలతో పాటు షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

సూపర్ హిట్ కాంబో...

గతంలో చిరు, బాబీ కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య సంక్రాంతికి రిలీజై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. దీంతో మెగా 158 మూవీపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ప్రీ లుక్‌తో ఆ అంచనాలు మరింత పెరిగాయి. బెంగాల్ నేపథ్యంలో తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా మూవీని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ ఎనర్జీ, చరిష్మాకు తగ్గట్లుగా రోల్ డిజైన్ చేసినట్లు ఇన్ సైడ్ వర్గాల టాక్. గతంలో ఎన్నడూ చూడని ఓ మాస్ లుక్‌లో పవర్ ప్యాక్ట్ ఎంటర్టైనర్‌ను సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించనున్నారట.

టైటిల్ అదేనా?

ఈ మూవీకి 'కాకాజీ' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. సినిమాలో మెగాస్టార్ సరసన ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తుండగా... చిరు కుమార్తె రోల్‌లో కన్నప్ప ఫేం ప్రీతి ముకుందన్ నటించనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ అనురాగ్ కశ్యప్ విలన్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా... వచ్చే ఏడాది మూవీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.