'నిజమైన నాయకుడు అధికారం కోసం ఎదగాలని అనుకోడు... తన ప్రజల కోసం వస్తాడు' - 'జన నాయగన్' ఫస్ట్ రోర్ (టీజర్) ప్రారంభంలో కనిపించిన కోట్ ఇది. దళపతి విజయ్ (Thalapathy Vijay) వ్యక్తిత్వాన్ని సూచించే మాట ఇది. తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయకుడు, పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న స్టార్ విజయ్. అయితే సినిమాలు వదిలేసి ప్రజల కోసం రాజకీయాలలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన చివరి సినిమా 'జన నాయగన్' అని ప్రచారం జరుగుతోంది. ఆయన పుట్టిన రోజు (జూన్ 22) సందర్భంగా మిడ్ నైట్ 12 గంటలకు టీజర్ విడుదల చేశారు.

పోలీస్ అధికారిగా విజయ్ ఎంట్రీ అదుర్స్! 'జన నాయగన్'లో విజయ్ పోలీస్ అధికారి పాత్రలో నటించినట్లు ఫస్ట్ రోర్ చూస్తే అర్థం అవుతోంది. కత్తి పట్టుకుని ఖాకి డ్రస్‌లో ఆయన ఇచ్చిన ఎంట్రీ అదిరింది. ఇదొక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. మరి, రాజకీయాల్లో పోలీస్ ఏం చేశారో తెలియాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాలి.  

విజయ్ స్టార్‌డమ్ గురించి దర్శకుడు హెచ్ వినోద్‌కు బాగా తెలుసు. అభిమానులతో పాటు ప్రేక్షకులు ఆయన నుంచి ఏం కోరుకుంటారు? అనేది దృష్టిలో పెట్టుకుని టీజర్ కట్ చేశారు. దీనికి అనిరుద్ రవిచందర్ అందించిన సంగీతం చాలా బాగుంది. కన్నడలో టాప్ ప్రొడక్షన్ హౌస్ అయినటువంటి కెవిఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కే నారాయణ భారీ ఎత్తున ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Also Read: దర్శకుడు పేరు లేకుండా విడుదలైన తెలుగు మూవీ... షూటింగ్‌లో సినిమాకు మించిన ట్విస్ట్‌లు

తెలుగులో 'జన నాయకుడు'గా...Jana Nayagan as Jana Nayakudu In Telugu: 'జన నాయగన్' సినిమాను తెలుగులో 'జన నాయకుడు'గా‌ విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ రోర్‌తో పాటు తెలుగు టైటిల్ అనౌన్స్ చేశారు.

Also Readతమిళ హీరోలకు మనం హిట్స్ ఇస్తే... మనకు ఏమో తమిళ దర్శకుల నుంచి డిజాస్టర్లు!

తమిళంతో పాటు తెలుగు, కన్నడ, ‌మలయాళ, హిందీలోనూ సినిమాను విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 9, 2026న సినిమా విడుదల చేయనున్నట్లు గతంలోనే తెలిపారు. ఇప్పుడు మరోసారి విడుదల తేదీని స్పష్టం చేశారు.

విజయ్ సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తున్నారు. 'జన నాయకుడు' కంటే ముందు 'బీస్ట్' సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే నటించారు. అందులో 'అరబిక్ కుత్తు...' పాట బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో పాటలు ఎలా ఉంటాయో చూడాలి. విజయ్, అనిరుద్ కాంబినేషన్ అంటే సూపర్ హిట్ ఆల్బమ్ గ్యారంటీ. 'జన నాయకుడు'తో పాటు 'కెజిఎఫ్' తర్వాత రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న 'టాక్సిక్'ను కూడా కెవిఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కే నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు.