DVV Entertainment Out From Vijay and H Vinoth Thalapathy 69 Project: తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ క్రేజీ గురించి ప్రత్యేకం చెప్పనవసరం లేదు. కోలీవుడ్‌లో ఆయనకు విపరీతమైన ఫ్యాన్స్‌ పాలోయింగ్‌ ఉంది. చెప్పాలంటే ఆయనకు తమిళంలో ఆర్మీయే ఉందని చెప్పాలి. తెలుగులోనూ విజయ్‌కి మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇక ఇటీవల విజయ్‌ తన పొలిటికల్‌ పార్టీ పేరులో మార్పులు చేసి అనౌన్స్‌మెంట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'తమిళగ వెట్రి కళగంగా' పేరుతో విజయ్ పార్టీ ప్రారంభమయ్యింది. అప్పటి నుంచి విజయ్‌ హాట్‌టాపిక్‌ అవుతున్నాడు. ఇక విజయ్‌ సినిమాకు గుడ్‌బై చెప్పబోతున్నాడంటూ ప్రచారం మొదలైంది. ఇక ఆయన చివరి చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (GOAT) అని అనుకున్నారంత.


తప్పుకున్న డీవీవీ ?


ఇది విజయ్ కెరీర్‌లో 68వ చిత్రంగా తెరకెక్కుతోంది. కానీ ఈ పుకార్లకు చెక్‌ పెడుతూ మరో చిత్రాన్ని ప్రకటించాడు విజయ్. హెచ్ వినోథ్ దర్శకత్వంలో పొలిటిక్‌ థ్రిల్లర్‌ ఈ చిత్రంగా ఇది రూపొందనుంది. అయితే ఈ సినిమాను ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి పాన్‌ ఇండియా చిత్రం తెరకెక్కించిన టాలీవుడ్‌ టాప్‌ ప్రొడ్యూసర్‌ డీవీవీ  దానయ్య నిర్మించడానికి ముందుకొచ్చారంటూ సినీవర్గాల నుంచి సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేకపోయిన.. డీవీవీ దానయ్య ఈ మూవీ నిర్మాతగా ఆల్మోస్ట్‌ కన్‌ఫాం అయ్యింరనేది టాక్‌. అయితే ఇప్పుడు ఈ మూవీ నుంచి డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ తప్పుకుందంటూ ప్రచారం జరుగుతుంది. తమిళ మీడియాలో దీనిపై కథనాలు కూడా వస్తున్నాయి. అయితే దీనిపై ఖచ్చితమైన సమాచారం లేదు.


కారణం ఇదేనా?


కానీ ఈ మూవీ విషయంలో దర్శక-నిర్మాతలకు పడలేదా? లేక విజయ్‌ డిమాండ్ మేరకు రెమ్యునరేషన్‌ ఇవ్వలేక తప్పకుందా? అంటూ కోలీవుడ్‌ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ మూవీ కోసం హెచ్‌ వినోథ్‌ అండ్‌ టీం ఇతర టాప్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌తో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.అయితే ఈ క్రమంలో దళపతి 69 నిర్మించేందుకు మూడు టాప్‌ నిర్మాణ సంస్థలు ఫైనల్‌ అయ్యాయట. అవి 7 Screen Studio, Sunpictures, AGS Production బ్యానర్లు కలిసి ఈ క్రేజీ ప్రాజెక్ట్స్‌ నిర్మించనున్నాయంటూ ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ప్రస్తుతం విజయ్‌ 'ది గోట్‌'(The GOAT) సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ మూవీ ఓ రెంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి.


Also Read: అందుకే నా పెళ్లి విషయాన్ని సీక్రెట్‌గా ఉంచా - అసలు విషయం చెప్పిన తాప్సి


'లియో' తర్వాత విజయ్‌ నటిస్తున్న ది గోట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతకు దగ్గట్టుగానే ప్రచార పోస్టర్స్‌ మూవీ హైప్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. రీసెంట్‌గా విడుదలైన The GOAT టైటిల్‌ పోస్టర్‌, సెకండ్‌ లుక్‌కు భారీ రెస్పాన్స్‌ వచ్చింది. ముఖ్యంగా సెకండ్‌ లుక్‌ ఫ్యాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు మూవీ క్యూరియసిటీ పెంచింది. ఇందులో విజయ్‌ రెండు లుక్‌లో కనిపించాడు. ఒకవైపు ఓల్డ్‌ గెటప్‌, మరోవైపు యంగ్‌ లుక్‌లో కనిపించాడు. చూస్తుంటే ఇందులో విజయ్‌ది ద్విపాత్రాభినయమా? అనిపించింది. ఇలా డ్యూయెల్‌ లుక్‌లో ఉన్న ఇద్దరు విజయ్‌లు బుల్లెట్‌ రైడ్‌లా గన్‌ఫైర్‌ చేస్తూ కనిపించాడు. ఈ పోస్టర్‌తో ది గోట్‌ హై వోల్డేజ్‌ యాక్షన్‌ మూవీ అని అర్థమైపోతుంది. ఇక ఈ మూవీ ఆగస్ట్‌లో రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.