David Warner's Mass Entry In Robinhood Movie: యంగ్ హీరో నితిన్ (Nithiin), వెంకీ కుడుముల కాంబోలో లేటెస్ట్ మూవీ 'రాబిన్ హుడ్' (Robinhood) శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీలో ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) గెస్ట్ రోల్ చేయగా.. ఆయన ఎంట్రీ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్, ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా హంగామా చేస్తున్నారు.

Continues below advertisement


స్క్రీన్ మీద మెరుపులే..


స్క్రీన్ మీద డేవిడ్ వార్నర్ మెరిసిపోయాడంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.. ఆరెంజ్ షర్ట్‌‍లో ఆయన స్టైలిష్ లుక్ అదిరిందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఆయన ఎంట్రీ సీన్ షేర్ చేస్తూ.. డేవిడ్ భాయ్ సూపర్ అంటూ హంగామా చేస్తున్నారు. నోట్లో లాలీపాప్ పెట్టుకుని హెలికాఫ్టర్‌ నుంచి స్టైలిష్‌గా వార్నర్ దిగిన సీన్‌కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈలలు, కేకలు వేస్తూ ఇది నిజంగా గూస్ బంప్స్ అంటూ చెబుతున్నారు.


ఆరెంజ్ షర్ట్ అందుకేనా..


డేవిడ్ వార్నర్ ఆరెంజ్ షర్ట్ ధరించిన స్టైలిష్ లుక్‌ను చూసిన నెటిజన్లు ఆయన మళ్లీ ఐపీఎల్ ఎంట్రీ ఇస్తాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఐపీఎల్‌లో SRH కెప్టెన్‌గా ఉన్న వార్నర్‌ కప్ అందించారు. 'రాబిన్ హుడ్' సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై తొలిసారి మెరవగా.. అటు క్రికెట్‌లో మెరుపుల్లానే ఇటు సినిమాలోనూ మెరుపులు మెరిపించాడంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 


Also Read: ఎంపురాన్ ఫస్ట్ డే కలెక్షన్స్... మిక్స్డ్ టాక్‌తో మోహన్ లాల్ బాక్సాఫీస్ రికార్డ్, ఎన్ని కోట్లు వచ్చాయంటే?


'భీష్మ' తర్వాత నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబోలో వచ్చిన 'రాబిన్ హుడ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నితిన్ సరసన శ్రీలీల నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీతోనే వార్నర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ టైం సిల్వర్ స్క్రీన్‌పై ఆయన్ను చూసిన తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మూవీలో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్‌తో పాటు వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషించారు. కేతిక శర్మ స్పెషల్ సాంగ్‌లో కనిపించారు.


ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?


ఈ సినిమాపై నితిన్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. 'రాబిన్ హుడ్'తో మళ్లీ కంబ్యాక్ ఇస్తానంటూ ఆయన మూవీ ప్రమోషన్స్‌లోనూ బలంగానే చెప్పారు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం టాక్ అందుకు భిన్నంగా ఉంది. మూవీలో డేవిడ్ వార్నర్‌ కనిపించేది కొద్ది సేపే అయినా సిల్వర్ స్క్రీన్‌పై ఆయన కనిపించగానే.. ఫ్యాన్స్ ఈలలు, గోలతో ఎంజాయ్ చేశారు. మూవీ ఫస్టాఫ్ పర్వాలేదని.. కామెడీ బాగుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.




నితిన్, శ్రీలీల జంట గురించి పర్వాలేదని కామెంట్ చేశారు. డేవిడ్ వార్నర్‌ను చూడాలంటే క్లైమాక్స్ వరకూ ఆగాల్సిందేనని.. జీవీ ప్రకాష్ కుమార్ బీజీఎం సినిమాకు అంతగా హైప్ ఇవ్వలేదని అంటున్నారు. ఫస్టాఫ్‌లో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్ కామెడీ కొంత వరకూ పర్వాలేదని చెబుతున్నారు. కేతికా శర్మ 'అదిదా సర్ ప్రైజ్' సాంగ్ బాగుందని పేర్కొంటున్నారు.