Mad Square Movie Review In Telugu: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా పరిచయమైన సినిమా 'మ్యాడ్'. అతనితో పాటు సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించారు. కాలేజీ నేపథ్యంలో తెరకెక్కిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో సీక్వెల్ 'మ్యాడ్ స్క్వేర్' తీశారు. ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. అది ఎలా ఉందో తెలుసా? 

ఫస్ట్ 40 మినిట్స్ నాన్ స్టాప్ నవ్వలే!'మ్యాడ్ స్క్వేర్' సినిమాలో కథ గురించి అడగొద్దని, కథ కోసం ఆలోచించే వాళ్ల కోసం తాము ఈ సినిమా తీయలేదని నిర్మాత నాగవంశీ మొదటి నుంచి చెబుతున్నారు. ఆయన అలా చెప్పడం వెనుక కారణం ఏమిటంటే... ఇందులో కథేమీ గొప్పగా లేదు. కానీ ఫస్ట్ 40 మినిట్స్ నాన్ స్టాప్ నువ్వులతో థియేటర్లు ఘొల్లుమని నవ్వేలా చేశారు దర్శకుడు కళ్యాణ్ శంకర్ అండ్ హిస్ రైటింగ్ టీం. 

Also Read: 'రాబిన్‌హుడ్' ట్విట్టర్ రివ్యూ: బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఆ దేవుడి మీద భారం వేయక తప్పదా... నితిన్ సినిమాకు ఊహించని టాక్!

ఒక లాఫింగ్ మూమెంట్ తర్వాత మరొక లాఫింగ్ మూమెంట్... ఇలా ఫస్ట్ 40 మినిట్స్ బ్యాక్ టు బ్యాక్ నవ్వులతో కథ గురించి ఆలోచించనివ్వకుండా చేసిందీ సినిమా. ఆ తరువాత కాసేపు నవ్వులకు బ్రేక్ ఇచ్చి కథ మీదకు కొంత వెళ్లారు గాని అదేమీ ఆకట్టుకునేలా లేదని ఓవర్సీస్ ప్రీమియర్స్ నుంచి టాక్ అందుతుంది.

సినిమాకు అసలైన హీరో లడ్డు అండ్ డాడీ!'లడ్డు గాడి పెళ్లి' నేపథ్యంలో వచ్చే సీన్స్ అన్నీ హిలేరియస్ ఫన్ అందించాయని సినిమా చూసిన వాళ్ళు చెప్పే మాట. ముఖ్యంగా లడ్డు అండ్ డాడీ సీన్స్ అన్ని బాగా వర్కౌట్ అయ్యాయట. అసలు ఈ సినిమాకు అసలైన హీరోలు వాళ్లే అని థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకులు చెబుతారని టాక్. లడ్డు గాడి డాడీతో బాయ్ మాట్లాడే సన్నివేశాలు సైతం నవ్విస్తాయట. ఒక్కటి కాదని... లాఫింగ్ మూమెంట్స్ సినిమాలో చాలా ఉన్నాయని తెలిసింది. 

ప్రియాంక జవాల్కర్ క్యారెక్టర్ స్పెషల్...రెబ్బా మోనికా జాన్ సాంగ్ సూపర్‌... ఇంకా!'మ్యాడ్' సినిమాలో హీరోలతో పాటు లడ్డు అండ్ ఫ్రెండ్స్ క్యారెక్టర్లు తీసుకొని 'మ్యాడ్ స్క్వేర్' చేశారు. ఆ సినిమాలో హీరోయిన్లను మాత్రం కంటిన్యూ చేయలేదు. కానీ ఇందులో గ్లామర్ అట్రాక్షన్ అంటే రెబ్బా మౌనిక జాన్ స్పెషల్ సాంగ్ ఒకటి. థియేటర్లలో కూడా దానికి మంచి రెస్పాన్స్ రావడం గ్యారంటీ అంటున్నారు. ఇక టాక్సీవాలా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ క్యారెక్టర్ స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తుంది. ఆవిడను థియేటర్లలో చూడండి. హీరోలు నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ బాగా చేశారట. యూత్ ఆడియన్స్‌కు నచ్చే సినిమా మ్యాడ్ అని అంటున్నారు.

Also Readఎల్2 ఎంపురాన్ రివ్యూ: మోహన్ లాల్ మూవీ హిట్టా? ఫట్టా? రిలీజ్‌కు ముందు వచ్చిన హైప్‌కు తగ్గట్టు ఉందా? లేదా?