Nithiin's Robinhood Movie Review: 'రాబిన్ హుడ్' సినిమాతో కం బ్యాక్ ఇస్తానని నితిన్ చాలా బలంగా చెప్పారు. 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్'లో శ్రీ లీలతో నటించానని, ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందని, కానీ ఈ సినిమాతో తామిద్దరం హిట్ పెయిర్ అనిపించుకుంటామని ఆయన తెలిపారు. అయితే... ఓవర్సీస్ ప్రీమియర్స్ నుంచి వస్తున్న టాక్ అందుకు భిన్నంగా ఉంది. సోషల్ మీడియాలో సినిమా టాక్ చూస్తుంటే ఫ్లాప్ తప్పదేమో అనిపిస్తుంది.

ఫస్టాఫ్ పర్వాలేదు కానీ...చెప్పుకోవడానికి ఏం లేదు!'రాబిన్ హుడ్' ఫస్టాఫ్ పర్వాలేదు కానీ సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదని ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. కామెడీ వర్కౌట్ అయిందని చెప్పుకొచ్చాడు. పాటల గురించి అయితే అసలు అడగొద్దన్నాడు. సెకండాఫ్ సినిమాను సేవ్ చేయాలని తెలిపాడు. తర్వాత సెకండాఫ్ పోర్షన్స్‌ పర్వాలేదన్నాడు. అయితే శ్రీలీల ఎపిసోడ్ మాత్రం క్రింజ్ అని కామెంట్ చేశాడు. 

నితిన్, శ్రీలీల జోడి ఓకే...క్లైమాక్స్‌లో డేవిడ్ వార్నర్ ధమాకా!సెకండాఫ్ తర్వాత కూడా సినిమా టాక్ మారలేదు. నితిన్, శ్రీ లీల జంట గురించి పరవాలేదని టాక్ వచ్చింది. వాళ్ళిద్దరి నటన గురించి గొప్పగా చెప్పేది ఏమీ లేదట. డేవిడ్ వార్నర్ ధమాకా చూడడం కోసం క్లైమాక్స్ వరకు వెయిట్ చేయాలట. అది సంగతి. ఆయన మాత్రం హిలేరియస్‌గా నవ్వించారట. జీవీ ప్రకాష్‌ కుమార్ మ్యూజిక్ మీద విమర్శలు వస్తున్నాయి.

నట కిరీటితో కిషోర్ కామెడీ!ఫస్టాఫ్ వరకు నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ చేసిన కామెడీ కొంత వరకు వర్కౌట్ అయిందని ఇద్దరు ముగ్గురు పేర్కొనగా... కామెడీ కూడా ఏమీ లేదని మరికొందరు తెలిపారు. కథ కోసం కాదని, ఫ్లోలో అలా చూస్తూ వెళ్లాల్సిన సినిమా అని అంటున్నారు. 'అదిదా సర్‌ప్రైజ్‌'లో కేతికా శర్మ బాగా చేసిందని చెబుతున్నారు.

పక్కా కమర్షియల్ ఫార్మాట్...రొటీన్ ట్రీట్మెంట్, యావరేజ్!'రాబిన్ హుడ్' సినిమా చూసిన జనాలు దర్శకుడు వెంకీ కుడుముల రైటింగ్ మీద విమర్శలు చేస్తున్నారు. ఆయన రచనలో ప్రతిదీ ఆర్టిఫిషియల్ కింద ఉందని, కొత్తగా ఏమీ లేదని, సినిమాలో ఒక సోల్ మిస్ అయ్యిందని చెబుతున్నారు. పక్కా కమర్షియల్ ఫార్మాటులో తీసిన ఈ సినిమా జనాలను మెప్పించడం కష్టమని కాస్త ఘాటుగా పోస్టులు చేస్తున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో రొటీన్ ట్రీట్మెంట్ కమర్షియల్ ఫార్మాట్ తప్ప ఏమీ లేవంటున్నారు. స్ట్రిక్ట్లీ యావరేజ్ సినిమా అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.

Also Read: ఎల్2 ఎంపురాన్ రివ్యూ: మోహన్ లాల్ మూవీ హిట్టా? ఫట్టా? రిలీజ్‌కు ముందు వచ్చిన హైప్‌కు తగ్గట్టు ఉందా? లేదా?