Akhanda 2 Ticket Hike Rates GO Suspended By Telangana High Court : గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య 'అఖండ 2' మూవీకి మరో బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్ టికెట్ ధరలు పెంచుతూ ఇచ్చిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. అలాగే, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో పాటు చిత్ర నిర్మాణ సంస్థకు సైతం నోటీసులు జారీ చేసింది.
ఈ నెల 5న మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఫైనల్‌గా అన్నీ ఇష్యూస్ క్లియర్ చేసుకుని రిలీజ్‌కు సిద్ధమైంది. గురువారం రాత్రి 9 గంటలకు ప్రీమియర్స్ ప్రదర్శించనుండగా ఇప్పటికే బుకింగ్స్ అయిపోయాయి. ప్రీమియర్ షోలకు రూ.600 టికెట్ నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం ప్రీమియర్ ధరల పెంపును రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
Also Read : 'మోగ్లీ' టికెట్ రేటు 99 రూపాయలే... 'రాజు వెడ్స్ రాంబాయి' రూటులో సుమ తనయుడి సినిమా
ప్రీమియర్స్ పరిస్థితి ఏంటి?
ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా... చాలామంది ప్రీమియర్ల కోసం టికెట్స్ బుక్ చేసుకున్నారు. తాజాగా హైకోర్టు ఆదేశాలతో ప్రీమియర్స్ వేస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. మరి సాధారణ రేటుకే షోస్ వేస్తారా? లేక షోస్ క్యాన్సిల్ చేస్తారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు, ఒకవేళ ప్రీమియర్స్ లేకుంటే టికెట్ డబ్బులు రీఫండ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అటు, ప్రీమియర్ ధరల పెంపు జీవో సస్పెండ్ చేసిన హైకోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
బాలయ్య, బోయపాటి మూవీ అంటేనే ఓ స్పెషల్ క్రేజ్. 'అఖండ 2' నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, స్పెషల్ ర్యాంపేజ్ వీడియోస్, సాంగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఎప్పుడెప్పుడు బాలయ్యను సిల్వర్ స్క్రీన్‌పై చూస్తామా? అంటూ ఎదురు చూసిన ఫ్యాన్స్‌కు హైకోర్టు తీర్పు కాస్త నిరాశ కలిగించిందనే చెప్పాలి. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ప్రీమియర్స్ రద్దైతే శుక్రవారం నుంచి తెలంగాణలో మూవీ రిలీజ్ కానుంది.