Actor Naga Babu Appreciates Pragathi : ఏషియన్ ఛాంపియన్ షిప్‌లో సీనియర్ నటి ప్రగతి మెడల్ సాధించడంపై నటుడు, జనసేన నేత నాగబాబు ఆమెను అభినందించారు. సోషల్ మీడియా వేదికగా ఆమెను ప్రశంసిస్తూ జనసేన తరఫున ఓ ప్రకటన విడుదల చేశారు.
అరుదైన విజయం... అభినందనలు
ఏషియన్ ఓపెన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్‌లో 4 మెడల్స్ సాధించిన నటి ప్రగతి గారికి అభినందనలు అని తెలిపారు నాగబాబు. 'నటనతో పాటు పవర్ లిఫ్టింగ్‌లోనూ అంతర్జాతీయ స్థాయిలో రాణించడం అనేక మందికి ఇన్‌స్పిరేషన్. ఆమె చీర కట్టుకుని పవర్ లిఫ్టింగ్ చేయడం గతంలో ఓసారి గమనించాను. 'ఇదేంటీ చీర కట్టుకుని పవర్ లిఫ్టింగ్ చేస్తోంది. సరదాకేమో...' అనుకున్నా. ఇంత డెడికేటెడ్‌గా ప్రాక్టీస్ చేసి ఇంటర్నేషనల్ స్థాయిలో పతకాలు సాధిస్తారని ఊహించలేదు.
వెండితెరపై మెప్పిస్తూ క్రీడా రంగంలోనూ రాణించడం విశేషం. చాలా మంది మహిళలకు ఆదర్శం. ప్రగతి గారు సినిమాలతో పాటు పవర్ లిఫ్టింగ్‌లోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా.' అని తెలిపారు.
Also Read : 'అఖండ 2' నుంచి ఎమోషనల్ సాంగ్ - రిలీజ్‌కు ముందు బిగ్ సర్‌ప్రైజ్... హార్ట్ టచింగ్ లిరిక్స్
ఓవైపు యాక్టింగ్‌లోనే కాకుండా పవర్ లిఫ్టింగ్‌లోనూ సత్తా చాటుతున్నారు నటి ప్రగతి. ఇటీవల టర్కీ వేదికగా ఏషియన్ ఛాంపియన్ షిప్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 4 మెడల్స్ సాధించారు. దీంతో ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా... '3 రోజెస్' వెబ్ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రగతి తనపై వచ్చిన ట్రోలింగ్స్, నెగిటివ్ కామెంట్స్‌పై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనను ఎక్కడ ట్రోల్ చేస్తారనే భయంతో మీడియాకు దూరంగా ఉంటున్నట్లు చెప్పారు.
చాలా మంది తనకు 'ఈ వయసులో ఇలాంటివి అవసరమా?'... జిమ్‌లో తన దుస్తులపై కూడా విమర్శలు చేశారని... అవి చూసి తనకు చాలా భయం వేసేదని చెప్పారు ప్రగతి. తనను ట్రోల్ చేసిన వారికి తన మెడల్స్‌తోనే ఆన్సర్ చెప్పినట్లు తెలిపారు. ఇండస్ట్రీలో ఉన్న మహిళలందరికీ ఈ మెడల్స్ అంకితం ఇస్తున్నట్లు వివరించారు. మాకు ఏమిచ్చినా ఇవ్వకపోయినా కొంచెం మర్యాద ఇవ్వాలని అన్నారు. తనకు ఇండస్ట్రీ నుంచి మంచు లక్ష్మి, బ్రహ్మానందం విష్ చేశారని తెలిపారు. తాజాగా... నాగబాబు సైతం ప్రగతి ప్రతిభను మెచ్చుకుంటూ ప్రశంసించారు.