Teja Sajja's Mirai Movie Teaser Release Date: 'హనుమాన్' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో తేజ సజ్జా లేటెస్ట్ మూవీ 'మిరాయ్'. సూపర్ యోధ రోల్‌లో భారీ యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ మూవీ తెరకెక్కనుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా.. ఈ మూవీ టీజర్ రిలీజ్‌పై బిగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.
టీజర్ ఎప్పుడంటే?
ఈ నెల 28న 'మిరాయ్' టీజర్ రిలీజ్ కానుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ప్రకటించారు. 'సూపర్ యోధ బిగ్ అడ్వెంచర్ కోసం సిద్దంగా ఉంది. మిరాయ్ ఎపిక్ వరల్డ్ ఎక్స్‌పీరియన్స్ చేసేందుకు వెయిట్ చేయండి.' అంటూ రాసుకొచ్చారు. ఈ సినిమాలో తేజ రోల్ డిఫరెంట్‌గా సూపర్ హీరోలాగా ఇంట్రెస్టింగ్‌గా డైనమిక్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఆకట్టుకుంటోన్న పోస్టర్
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. పాత కాలం నాటి రైలుపై ఓ యోధుడిలా తేజ సజ్జా కనిపిస్తుండడం ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఇది వరకూ రిలీజ్ చేసిన పోస్టర్స్ సైతం భారీ హైప్ క్రియేట్ చేశాయి.
విలన్‌గా మంచు మనోజ్
ఎప్పుడూ డిఫరెంట్ రోల్స్ అలరించే మంచు మనోజ్ చాలా ఏళ్ల తర్వాత 'మిరాయ్'తో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ సినిమాలో ఆయన విలన్ రోల్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్ మనోజ్ న్యూ లుక్‌తో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. పొడుగు జుట్టు, స్టైలిష్ లుక్‌లో అదరగొట్టారు. 'బ్లాక్ స్వార్డ్ అంటే ప్రపంచంలోని అత్యంత పవర్ ఫుల్ శక్తుల్లో ఒకటి.' అంటూ ఆయన క్యారెక్టర్ గురించి గ్లింప్స్‌లో రివీల్ చేశారు. కత్తి పట్టి రక్తపాతం సృష్టించిన మనోజ్ తర్వాత కూల్‌గా నడుచుకుంటూ వెళ్లిపోవడం మూవీలో ఆయన రోల్‌పై మరింత బజ్ క్రియేట్ చేసింది.
ఆగస్ట్ 1న రిలీజ్
ఈ మూవీని పాన్ ఇండియా వైడ్‌గా ఆగస్ట్ 1న ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. 8 భాషల్లో 2డీ, 3డీ ఫార్మాట్‌లో రిలీజ్ చేయనున్నారు. తేజ సజ్జా సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. గౌర హరి మ్యూజిక్ అందించనున్నారు. అశోక కళింగ యుద్ధ పరిణామాల తర్వాత రాసిన గ్రంథాలు.. వాటిని తరతరాలుగా కాపాడుతూ వస్తున్న 9 మంది యోధులు ప్రధానాంశంగా మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది.