Teja Sajja Shares Intersting Post On Project K: 'హనుమాన్' మూవీతో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకుని అదే జోష్‌తో మరో సూపర్ అడ్వెంచరస్ థ్రిల్లర్ 'మిరాయ్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు యంగ్ హీరో తేజ సజ్జా. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా తేజ సజ్జా చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.

'కల్కి 2898 AD' సీక్వెల్‌లో...

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బిగ్గెస్ హిట్‌లో ఒకటైన విజువల్ వండర్ 'కల్కి 2898 AD' సీక్వెల్‌లో తేజ భాగం కానున్నట్లు ఆ పోస్ట్ ద్వారా తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆయన కుమార్తె స్వప్న దత్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఆమెకు తాజాగా బర్త్ డే విషెష్ చెబుతూనే... 'ప్రాజెక్ట్ K'లో కలుద్దాం' అంటూ ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చారు. ఆమెతో దిగిన ఫోటోతో పాటు ఓ ఎమోజీని కూడా జత చేశారు.

ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా... తేజ సజ్జా త్వరలోనే హిట్ సినిమాటిక్ యూనివర్స్‌లో పార్ట్ కాబోతున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఆ మూవీలో ఆయన ఎలాంటి రోల్ చేస్తారు? లేదా నార్మల్‌గానే అలా పెట్టారా? అంటూ చర్చించుకుంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మూవీలో మంచి కాంబో అని అంటున్నారు. మరి దీనిపై తేజనే స్వయంగా రియాక్ట్ కావాల్సి ఉంది. అంత వరకూ దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

Also Read: ఫస్ట్ టైం నీ బర్త్ డే మిస్ అవుతున్నా - మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్... SSMB29 షూటింగ్‌లో బిజీ బిజీ

'కల్కి' సీక్వెల్ షూటింగ్ ఎప్పుడు?

డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ అందరి మదిలో మెదిలే ప్రశ్నే ఇది. 'కల్కి' సీక్వెల్ షూటింగ్ ఎప్పుడు? అనేది అందరిలోనూ ఆసక్తిగా మారింది. గతంలో నిర్మాత అశ్వినీదత్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ మూవీ షూటింగ్‌పై కీలక కామెంట్స్ చేశారు. సెప్టెంబర్‌ నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని... ఫస్ట్ పార్ట్‌ను మించి సెకండ్ పార్ట్ ఉంటుందని అనౌన్స్ చేశారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. గతేడాది రిలీజ్ అయిన 'కల్కి 2898 AD' బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది. ఈ విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1000 కోట్లు వసూళ్లు సాధించింది.

ప్రస్తుతం ప్రభాస్... మారుతి డైరెక్షన్‌లో 'ది రాజా సాబ్', హను రాఘవపూడి డైరెక్షన్‌లో 'ఫౌజీ' మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్స్‌లో బిజీగా ఉండడంతో 'కల్కి' సీక్వెల్ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు, నాగ్ అశ్విన్ కూడా రీసెంట్‌గా ఎక్కడా ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడలేదు. ఈ క్రమంలో వచ్చే ఏడాది ప్రారంభంలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందా? అనేది తెలియాల్సి ఉంది. ఈ విజువల్ వండర్ కోసం ప్రేక్షకులు ఎంతగానే ఎదురుచూస్తున్నారు.