చైల్డ్ ఆర్టిస్టులు కూడా స్టార్ హీరోలు అవ్వగలరు. చైల్డ్ ఆర్టిస్టులుగా మాత్రమే కాకుండా బాధ్యతగల హీరోల్లాగా కూడా మెప్పు పొందగలరు అని నిరూపించిన వారు ఎంతోమంది ఉన్నారు. అసలు చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోలుగా మారి అద్భుతాలు సృష్టించవచ్చు అని నిరూపించిన వారిలో ముందు స్థానంలో ఉంటాడు తరుణ్. చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న తరుణ్.. హీరోగా మారిన తర్వాత లవ్ బాయ్‌గా ఇమేజ్ సంపాదించుకున్నాడు. తను చేసిన ప్రేమకథలు, అందులో తరుణ్ నటన ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్. అయితే తరుణ్ పెళ్లి గురించి గత కొన్నిరోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. కొన్ని మీడియా సంస్థలు తమకు తోచిన ‘పులిహోర’ కథలు కలిపేస్తున్నాయి. ఈ వార్తలపై లవర్ బాయ్ తాజాగా స్పందించాడు.


ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అందమైన ప్రేమకథలు చేయాలంటే మేకర్స్‌కు ఉండే రెండే రెండు ఆప్షన్స్ ఉదయ్ కిరణ్, తరుణ్. ఈ ఇద్దరు హీరోలు పోటాపోటీగా ప్రేమకథల్లో నటిస్తూ, యూత్‌ను బాగా ఆకట్టుకున్నారు. అంతే కాకుండా కమర్షియల్ సినిమాల విషయంలో కూడా ఈ ఇద్దరు హీరోలు మినిమమ్ గ్యారెంటీ నటులుగా పేరు దక్కించుకున్నారు. ముఖ్యంగా తరుణ్ అయితే అమ్మాయిలకు క్రష్‌లాగా మారిపోయాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం మాత్రమే కాదు.. అవన్నీ బాక్సాఫీస్ దగ్గర హిట్ సాధించేవి కూడా. కానీ అనుకోకుండా తరుణ్ కెరీర్ ఒక్కసారిగా డీలా పడింది.


పెళ్లి రూమర్స్‌పై క్లారిటీ


తరుణ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పర్సనల్ లైఫ్ గురించి అందులో పోస్టులు పెడుతుంటాడు. కానీ బయట మాత్రం ఎక్కువగా కనిపించడం మానేశాడు. లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకొని, ఎన్నో ప్రేమకథల్లో నటించినా కూడా తరుణ్‌కు ఇంకా పెళ్లి అవ్వకపోవడం కొందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అందుకే తరుణ్ ఎప్పటికప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడంటూ రూమర్స్ సోషల్ మీడియా, సినీ సర్కిల్లో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా అలాంటి వార్తలు మళ్లీ తెరపైకి వచ్చాయి. దీంతో తరుణ్ స్వయంగా తన పెళ్లి రూమర్స్‌పై స్పందించాడు. తన పెళ్లి ప్రచారంలో నిజం లేదని తేల్చి చెప్పాడు. నిజంగా తాను ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటే నిరభ్యంతరంగా సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా చెప్తానని, తన పెళ్లి విషయంలో ఈ పుకార్లు ఎందుకు పుట్టుకొస్తున్నాయో తెలియడం లేదని అన్నాడు తరుణ్. అయినా కూడా తరుణ్ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని తన ఫ్యాన్స్ చాలామంది ఎదురుచూస్తున్నారు.






తరుణ్ సినీ ప్రస్థానం


2000 నుండి 2005 వరకు తరుణ్ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉంది. ప్రేమకథలతో పాటు పలు కమర్షియల్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశాడు ఈ హీరో. కానీ ఆ తర్వాత సంవత్సరానికి ఒక్క సినిమా చేయడం కూడా కష్టంగా మారిపోయింది. అప్పుడే తరుణ్‌కు పోటీగా ఎంతోమంది యంగ్ హీరోలు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. వారికి గట్టి పోటీ ఇవ్వాలంటే తరుణ్‌కు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అవసరం అయ్యాయి. కానీ అనుకోకుండా తన సినిమాలు ఏవీ అంతగా ఆడలేదు. దీంతో పోటీ తట్టుకోలేక, చేతిలో సినిమా ఆఫర్లు లేక తరుణ్.. మెల్లగా వెండితెరపై కనుమరుగయిపోయాడు. ఈ హీరో చివరిగా 2018లో ‘ఇది నా లవ్ స్టోరీ’ అనే చిత్రంలో హీరోగా కనిపించాడు. ఆ తర్వాత ఇంకే సినిమాలో తాను కనిపించలేదు.


Also Read: నిద్రలేని రాత్రిళ్లు గడిపా, ‘గుంటూరు కారం’ మూవీపై క్లారిటీ ఇచ్చిన తమన్


Join Us on Telegram: https://t.me/abpdesamofficial