Tanushree Dutta Shocking Comments On Her Life Threat: బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా మరోసారి షాకింగ్ కామెంట్స్‌తో వార్తల్లో నిలిచారు. తన ఇంట్లోనే తాను వేధింపులకు గురవుతున్నట్లు ఇటీవల కన్నీళ్లు పెట్టుకుని ఓ వీడియో రిలీజ్ చేయగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు ప్రాణ హాని ఉందంటూ చెప్పడం ఆందోళన కలిగిస్తోంది.
నన్ను చంపాలని చూస్తున్నారు
వేధింపులపై తాను ఇటీవల చేసిన వీడియో వైరల్ అయినప్పటి నుంచి వరుస ఇంటర్వ్యూల కోసం ఎంతోమంది తనకు ఫోన్ చేస్తున్నట్లు తనుశ్రీ తెలిపారు. గత కొంతకాలంగా తాను ఆధ్యాత్మిక జీవనశైలికి అలవాటు పడినట్లు... అందుకే ఎక్కువగా మీడియా ముందుకు రావడం లేదని చెప్పారు. 'నాకు హెల్త్ బాగాలేదు. కొన్ని రోజులుగా వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూనే ఉన్నా. అందరితోనూ త్వరలోనే మాట్లాడతా. కాకుంటే దానికిి టైం పడుతుంది. దయచేసి నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనివ్వండి.' అని అన్నారు తనుశ్రీ.
Also Read: 'కింగ్‌డమ్'కు సందీప్ రెడ్డి వంగా రివ్యూ... విజయ్ దేవరకొండ సినిమాపై ఆయన రిపోర్ట్ ఏమిటంటే?
బాలీవుడ్ మాఫియా ముఠా
బాలీవుడ్ మాఫియా ముఠా చాలా పెద్దదని తనుశ్రీ తెలిపారు. 'ముంబయిలో నా ప్రాణానికి ముప్పు ఉంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌లానే నా ప్రాణం కూడా ప్రమాదంలో ఉంది. అతనిలానే నన్ను కూడా చంపాలని చూస్తున్నారు.' అంటూ షాకింగ్ కామెంట్స్ చేయగా వైరల్ అవుతున్నాయి.
ఇటీవలే తనుశ్రీ కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తన ఇంట్లోనే తనను వేధిస్తున్నారని... పోలీసులకు చెప్తే స్టేషన్‌కు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలంటున్నారని చెప్పారు. 'గత నాలుగైదేళ్ల నుంచి ఈ బాధ తట్టుకోలేకపోతున్నా. నాకు నమ్మకంగా ఉంటారని పనివాళ్లను పెట్టుకుంటే నా వస్తువుల్ని చోరీ చేస్తున్నారు. నా ఇంట్లోనే నాకు సేఫ్టీ లేకుండా పోయింది. నేను 2020 నుంచి ఇలాంటి పెద్ద పెద్ద శబ్దాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. పైకప్పు, తలుపు బయట నుంచి దాదాపు రోజూ ఇలా పెద్ద పెద్ద చప్పుళ్లతో అగచాట్లు పడుతున్నా. బిల్డింగ్ మేనేజ్మెంట్ వాళ్లకు ఫిర్యాదులు చేసి విసిగిపోయాను. ఫలితం లేదని వదిలేశాను. నాకు కాస్త హెల్ప్ చేయండి.' అంటూ ఆవేదనతో వీడియో రిలీజ్ చేశారు.
అసలెవరీ తనుశ్రీ?
బాలీవుడ్‌లో ఒకప్పుడు తనుశ్రీ ఓ వెలుగు వెలిగారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లోని మూవీస్‌లో తనదైన నటనతో స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నారు. బిహార్‌కు చెందిన ఈమె 2004 ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ విజేతగా నిలిచారు. 'ఆషిక్ బనాయా ఆప్నే' పాటతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. తెలుగులో 'వీరభద్ర' మూవీలోనూ నటించారు. 2013 వరకూ బాలీవుడ్‌లోనే పలు మూవీస్ చేశారు. ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు.
ఆ తర్వాత 2018లో 'మీటూ' (#Metoo) ఉద్యమంలో భాగంగా నానా పాటేకర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తనను లైంగికంగా వేధించారని ఆరోపించగా... విచారణలో పటేకర్‌కు క్లీన్ చిట్ వచ్చింది. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తనను ఓ మూవీ కోసం నగ్నంగా డ్యాన్స్ చేయాలని అడిగారంటూ అప్పట్లో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాజాగా... తనకు ప్రాణ హాని ఉందంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.