రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించనున్న సినిమా 'స్పిరిట్' (Spirit Movie). ఈ మూవీ అనౌన్స్ చేసి చాలా రోజులు అయింది. కానీ, ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది? అని రెబల్ ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు వాళ్లకు డైరెక్టర్ మంచి అప్డేట్ ఇచ్చారు.
సెప్టెంబర్ నుంచి స్పిరిట్ షురూ...ఒక్కసారి మొదలెడితే అయ్యే వరకూ!విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిననూరి దర్శకత్వం వహించిన 'కింగ్‌డమ్' జూలై 31న విడుదల కానున్న సందర్భంగా వాళ్ళిద్దరితో ఇంటర్వ్యూ చేశారు సందీప్ రెడ్డి వంగా. అందులో 'స్పిరిట్' గురించి డిస్కషన్ వచ్చింది.
Spirit Regular Shooting Update: 'స్పిరిట్' షూటింగ్ ఎప్పుడు? అని సందీప్ రెడ్డి వంగాను విజయ్ దేవరకొండ అడిగారు. అందుకు సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు దర్శకుడు. 'నాన్ స్టాప్‌గా కొట్టేస్తావా?' అని విజయ్ మరోసారి అడగ్గా అవును అన్నట్లు మరోసారి బ్రదర్ ఇచ్చారు సందీప్. 'స్పిరిట్' సినిమాలో ప్రభాస్ సరసన 'యానిమల్' ఫేమ్ తృప్తి దిమ్రి కథానాయికగా నటించనున్నారు. తొలుత ఆ అవకాశం దీపికా పదుకోన్ చెంతకు వెళ్ళింది. దర్శకుడితో ఆమెకు క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో తప్పుకొన్నారు.
Also Read: 'కింగ్‌డమ్'కు సందీప్ రెడ్డి వంగా రివ్యూ... విజయ్ దేవరకొండ సినిమాపై ఆయన రిపోర్ట్ ఏమిటంటే?
Prabhas Upcoming Movies: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న 'స్పిరిట్' కాకుండా ప్రభాస్ చేతిలో మరో నాలుగు సినిమాలో ఉన్నాయి. అందులో రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. మారుతి దర్శకత్వం వహిస్తున్న 'ది రాజా సాబ్' డిసెంబర్ 5న విడుదల కానుంది. ఆ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. అది కాకుండా హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ' చేస్తున్నారు. ఆ టైటిల్ ఇంకా అనౌన్స్ చేయలేదు గాని సినిమా షూటింగ్ మాత్రం చాలా వరకు కంప్లీట్ చేశారు.
సెప్టెంబర్ లోపు 'ది రాజా సాబ్', 'ఫౌజీ' సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేసేలా ప్రభాస్ ప్లాన్ చేశారు. తన సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మరొక సినిమా చేయకూడదని సందీప్ రెడ్డి వంగా కండిషన్ పెట్టారు. తన సినిమాలో హీరో పోలీస్ కనుక లుక్ సంథింగ్ స్పెషల్ అన్నట్టు డిజైన్ చేశారట. వేరే సినిమా చేస్తే లుక్ రివీల్ కావడంతో పాటు కంటిన్యూటీ దెబ్బతింటుందని ఆయన వివరించారట. అందుకు ప్రభాస్ కూడా ఒకే చెప్పారు.
స్ట్రయిట్ కథలు కాకుండా ప్రభాస్ చేతిలో రెండు సీక్వెల్స్ ఉన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి 2898 ఏడీ 2' కూడా చేయాల్సి ఉంది. బాలీవుడ్ దర్శకులు సైతం ప్రభాస్ హీరోగా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.