Euphoria: గుణశేఖర్ 'యుఫోరియా'లో తమిళ స్టార్ డైరెక్టర్ - ఆ వార్తల్లో నిజం ఎంతంటే?

Gautham Vasudev Menon: దర్శకుడు గుణశేఖర్ లేటెస్ట్ మూవీ 'యుఫోరియా' మూవీపై ఓ క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ప్రముఖ తమిళ డైరెక్టర్ గౌతమ్ మీనన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Continues below advertisement

Tamil Director Vasudev Menon Plays A Key Role In Guna Sekhar's Euphoria: దర్శకుడు గుణశేఖర్ (Guna Sekhar).. సమంత శాకుంతలం తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని 'యుఫోరియా' (Euphoria) అనే చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సీనియర్ నటి భూమిక హీరోయిన్‌గా నటిస్తుండగా.. నీలిమ గుణ నిర్మిస్తున్నారు. గుణశేఖర్ హోమ్ బ్యానర్ గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్‌పై తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా తాజాగా ఓ క్రేజీ అప్ డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Continues below advertisement

ప్రముఖ తమిళ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ 'యుఫోరియా'లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆయన పాత్రపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దీన్ని మూవీ టీం ధ్రువీకరించాల్సి ఉంది. ఈ మూవీలో సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమం;చలి, అడ్డాల పృధ్వీరాజ్, కల్పలత కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాల భైరవ సంగీతం సమకూర్చారు. 

Also Read: 'ఛావా' ఫస్ట్ రివ్యూ - నేషనల్ క్రష్ రష్మిక బాలీవుడ్‌లో భారీ హిట్టు కొట్టిందా?

దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆ కాంబో

కాగా, దాదాపు 20 ఏళ్ల తర్వాత దర్శకుడు గుణశేఖర్, హీరోయిన్ భూమిక కాంబో రిపీట్ అవుతుండగా.. 'యుఫోరియా' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని సరికొత్త కథాంశంతో గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. యూత్ ఫుల్ సోషల్ డ్రామాగా ఈ 'యుఫోరియా' మూవీ తెరకెక్కుతున్నట్టు టాక్ నడుస్తోంది. గతంలో డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించిన 'ఒక్కడు' బ్లాక్ బస్టర్ హిట్‌‌గా నిలిచింది. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో పాటు భూమికకు ఈ మూవీ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఆ తర్వాత ఈ రేంజ్‌‌లో ఒక్క హిట్ సైతం గుణశేఖర్ ఖాతాలో పడలేదు. నిజానికి ఆయన సమంత 'శాకుంతలం' సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. ఈ క్రమంలో కాస్త గ్యాప్ తీసుకుని మరీ 'యుఫోరియా'ను ప్రకటించారు. మరి ఈ సినిమా డిఫరెంట్ స్టోరీ.. భూమిక, గుణశేఖర్ కాంబో హిట్ మళ్లీ రిపీట్ అవుతుందో లేదో అనేది చూడాలి.

Also Read: అనుపమతో ప్రదీప్ 'డ్రాగన్'... 'లవ్ టుడే' రేంజ్ సక్సెస్ రిపీట్ చేస్తాడా? రన్ టైమ్, సెన్సార్ టాక్ నుంచి ఓటీటీ డీల్ వరకు - ఈ విషయాలు తెల్సా?

Continues below advertisement