'ది రెబల్ ఆఫ్ ఇండియన్ సినిమా'గా పేరు పొందిన దర్శకుడు వి శాంతా రామ్ (V Shantaram). హిందీ, మరాఠీ భాషల్లో పలు సినిమా తీశారు. ఆయన దర్శకుడు మాత్రమే కాదు... నటుడు, నిర్మాత కూడా! ఆయన జీవితంపై తెరకెక్కుతున్న సినిమా 'వి శాంతా రామ్' (V Shantaram Biopic Cast). 'గల్లీ బాయ్' ఫేమ్ సిద్ధాంత్ చతుర్వేది టైటిల్ రోల్ చేస్తున్నారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నటిస్తున్నారు. ఈ రోజు ఆవిడ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
జయశ్రీ పాత్రలో తమన్నా!తమన్నా భాటియా కెరీర్ ప్రారంభంలో గ్లామరస్ రోల్స్ చాలా చేశారు. అయితే గత కొన్ని ఏళ్లుగా కమర్షియల్ సినిమాలు చేయడంతో పాటు పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు 'వి శాంతా రామ్' బయోపిక్‌లోనూ అటువంటి రోల్ ఆమె చేస్తున్నారు.
నటి జయశ్రీ పాత్రలో తమన్నా భాటియా నటిస్తున్నట్లు 'వి శాంతా రామ్' బయోపిక్ మేకర్స్ తెలిపారు. ఈ రోజు ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. 90వ దశకం కంటే ముందు సినిమాల్లో హీరోయిన్లు ఎలా ఉండేవారో, అటువంటి లుక్కులో తమన్నా కనిపించారు. ఆమె లుక్ మీరూ చూడండి.
Also Read: Japan Earthquake: జపాన్‌లో భూకంపం... మన బాహుబలి ప్రభాస్ సేఫ్ - రాజా సాబ్ డైరెక్టర్ క్లారిటీ
ఐదు హిందీ సినిమాల్లో తమన్నాTamannaah Bhatia Upcoming Movies: 'వి శాంతా రామ్' బయోపిక్ కాకుండా తమన్నా చేతిలో మరో ఐదు సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ రూపొందించిన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'బ్యాడాస్ ఆఫ్ బాలీవుడ్'లో తమన్నా చేసిన స్పెషల్ సాంగ్ వైరల్ అయ్యింది. ఇప్పుడు హిందీ ప్రేక్షకులలో ఆవిడకు విపరీతమైన క్రేజ్ ఉంది.