Kalki Movie Collections: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బిగ్ బీ అమితాబ్, లోక నాయకుడు కమల్ హాసన్, దీపికా పదుకొనె లాంటి స్టార్ కాస్ట్ తో నిండిన సినిమా కల్కి 2898 AD కలెక్షన్లపై ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీలైతే బాహుబలి 2 లేదంటే కనీసం నాన్ బాహుబలి రికార్డ్స్ ను కొల్లగొట్టే సినిమా కల్కినే అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అలాగే ఫస్ట్ డే కలెక్షన్ లలో కల్కీనే నెంబర్ వన్ గా నిలుస్తుందని కూడా లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు వారి ఆశలపై నీళ్ళు చల్లే పరిస్థితి ఎదురైంది.


కల్కి రిలీజ్ నాడే వరల్డ్ కప్ సెమీస్
కల్కి 2898 AD రిలీజ్ నాడే టీమ్ ఇండియా టీ 20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ తో తలపడుతోంది. ఇండియన్ టైం ప్రకారం రాత్రి 8 గంటల కు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే గ్రౌండ్ లో దిగిన ప్రతీ మ్యాచ్ లోనూ గెలుస్తూ టైటిల్ ఫేవరెట్ గా దూసుకు పోతుంది రోహిత్ సేన. ఆస్ట్రేలియా లాంటి మేటి జట్టునే ఇంటికి పంపిన భారత జట్టు తన నెక్స్ట్ టార్గెట్ ఇంగ్లాండ్ నే అంటుంది. ప్రపంచ కప్ సెమీస్ కావడం తో ఎక్కడెక్కడో ఉన్న భారత అభిమానులు అందరూ టీవీ లకు అతుక్కుపోవడం ఖాయం. అదే జరిగితే రాత్రి 8 గంటల నుండి మ్యాచ్ పూర్తయ్యే వరకూ బయటకు వచ్చే వారి సంఖ్య తక్కువే గానే ఉంటుంది. అదే కల్కి సినిమా అభిమానులను టెన్షన్ పెడుతోంది.


కల్కి ఫస్ట్ డే కలెక్షన్స్ పై ఎఫెక్ట్ తప్పదా?
ప్రస్తుతం టాలీవుడ్ ఫస్ట్ డే కలెక్షన్స్ లో ప్రభాస్ సినిమాలు రెండు ఉన్నాయి. సలార్, బాహుబలి - 2 సినిమాలు టాప్ 5 మూవీస్ లో ఉన్నాయి. కానీ నెంబర్ వన్ స్థానం మాత్రం రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటించిన RRR దే. ఆ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి తొలి రోజున రూ.74 కోట్ల షేర్ రాబట్టింది. ప్రభాస్ సలార్ రూ.50.49 కోట్ల షేర్ తో సెకండ్ ప్లేస్ లో ఉండగా రూ.43 కోట్లతో బాహుబలి 2, మహేష్ బాబు గుంటూరు కారం సినిమా రూ.38.88 కోట్లు, మెగాస్టార్ చిరంజీవి "సైరా నరసింహ రెడ్డి" 38.75 కోట్ల షేర్ రాబట్టాయి. ఇప్పుడు కల్కితో ఈ రికార్డ్స్ అన్నీ రెబల్ స్టార్ బద్దలు కొడతాడనీ ఫిక్స్ అయిపోయారు డార్లింగ్ ఫ్యాన్స్. కానీ పులి మీద పుట్రలా టీ 20 వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్ ఎఫెక్ట్ కల్కి ఫస్ట్ డే కలెక్షన్స్ పై పడుతుందనే భయం కూడా వాళ్ళలో లేకపోలేదు.


ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా కోసం వచ్చే సాయంత్రం షోస్ పై ఈ మ్యాచ్ ఎఫెక్ట్ పడుతుందేమో అన్న ఆందోళన ఒకపక్క ఉన్నా మరోవైపు  ఆన్లైన్ లో కల్కి సినిమా టికెట్లన్నీ బుక్ అయిపోవడం ప్రభాస్ ఫ్యాన్స్ కు ఊరటనిస్తుంది. మరోవైపు ఏపీ ప్రభుత్వంతో ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మాతల చర్చలు ఫలించి కల్కికి ఏపీలో కూడా 6 ఆటలకు అనుమతి వచ్చింది. పైగా టికెట్ రేట్లు కూడా పెంచుకునే అవకాశం కలగడంతో కచ్చితంగా కల్కి సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే కలెక్షన్స్ ను డార్లింగ్ ప్రభాస్ కొల్లగొడతాడనే నమ్మకంతో ఉన్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్.