Suriya's Vishwanath And Sons Release Date Locked : కోలీవుడ్ స్టార్ సూర్య రీసెంట్‌గా కరుప్పు హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆయన నెక్స్ట్ మూవీ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హిట్ జోష్ కంటిన్యూ చేస్తూ... టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబోలో రాబోతోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

Continues below advertisement

రిలీజ్ ఎప్పుడంటే?

'విశ్వనాథ్ అండ్ సన్స్' ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య తెలుగులో డైరెక్ట్‌గా చేస్తున్న ఫస్ట్ మూవీ ఇదే కావడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. అంతే కాకుండా కరుప్పు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రిలీజ్ అవుతున్న మూవీ కావడంత ఆ హైప్ పదింతలు అవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. 

Continues below advertisement

సినిమాలో సూర్య ఒలింపిక్ షూటర్‌గా సంజయ్ విశ్వనాథ్ రోల్‌లో కనిపించనున్నారు. ఆయన స్టైలిష్ వింటేజ్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. తన కన్నా 20 ఏళ్ల చిన్న అమ్మాయి హీరోని ప్రేమిస్తే ఏం జరిగింది? అనేదే మూవీ స్టోరీ. ఒలింపిక్ షూటర్‌గా హీరో కెరీర్‌లో జరిగిన పరిణామాలు... ఇలా ఎమోషన్స్, కామెడీ, కుటుంబ విలువలు ఓ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా మూవీ రాబోతోంది. చిన్నారితో సూర్య కలిసి కనిపించిన పోస్టర్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి.

Also Read : 'బ్లాస్ట్ జోన్' రివ్యూ: యాక్షన్ కింగ్ అర్జున్ లేటెస్ట్ థ్రిల్లర్ - సినిమా ఎలా ఉందంటే?

ఈ మూవీలో మమితా బైజు, రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించగా... శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ భాషల్లోనూ మూవీ రిలీజ్ కానుంది. తమిళనాడులో ఈ చిత్రాన్ని థింక్ స్టూడియోస్ విడుదల చేయనుండగా, రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

విశ్వనాథ్ అండ్ సన్స్ టెక్నికల్ టీం : రచన, దర్శకత్వం - వెంకీ అట్లూరి, నిర్మాతలు - సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, సంగీతం - జి.వి. ప్రకాష్ కుమార్, DOP - నిమిష్ రవి, ఎడిటర్ - నవీన్ నూలి, ఆర్ట్ - బంగ్లాన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - యలమంచిలి గోపాల కృష్ణ (నాని),ఫైట్ మాస్టర్ - వి వెంకట్, నిర్మాణ సంస్థలు - సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సమర్పణ - శ్రీకర స్టూడియోస్.

Also Read : కరుప్పు ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలుసా - ఆ స్టార్‌కు హిట్ ఎలా మిస్ అయ్యిందంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.