Suriya Nelson Dilipkumar To Collaborate For Comedy Entertainer : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ జూనియర్ ఎన్టీఆర్‌తో మూవీ చేయబోతున్నారంటూ ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ దీన్ని నిర్మించనున్నట్లు సోషల్ మీడియాలో టాక్ విస్తృతంగా వినిపించింది. అయితే, ఇప్పుడు ప్లాన్ మారిందని కోలీవుడ్ స్టార్ సూర్యతో నెల్సన్ మూవీ చేయబోతున్నట్లు లేటెస్ట్ బజ్.

Continues below advertisement

ఫుల్ కామెడీ ఎంటర్టైనర్‌గా...

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్‌గా 'సూర్య 50' మూవీ రూపొందించనున్నట్లు టాక్. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు తెలుస్తుండగా... రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం నెల్సన్ రజనీకాంత్‌తో జైలర్ 2 మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 11న వినాయక చవితి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Continues below advertisement

అలాగే, 'KHxRK రీ యూనియన్' మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. వీటి తర్వాతే సూర్యతో మూవీపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ సూర్యతో మూవీ తీస్తే... నెల్సన్ స్టైల్ కామెడీ పంచెస్‌కు సూర్య ఎనర్జీ తోడైతే థియేటర్స్‌లో నవ్వుల తుపాన్ కన్ఫర్మ్ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్‌గా సూర్య కరుప్పుతో బిగ్ సక్సెస్ అందుకున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఆగస్ట్ 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.

Also Read : Thankyou Subbarao OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ - అమ్మాయిల హత్యల మిస్టరీ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఎన్టీఆర్‌తో అనుకున్నా...

తొలుత ఈ కామెడీ ఎంటర్టైనర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌తో చేయబోతున్నట్లు ప్రచారం సాగింది. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ డ్రాగన్‌ మూవీతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ 'గాడ్ ఆఫ్ వార్' ట్రాక్ ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. వరుస ప్రాజెక్టులతో ఆయన బిజీగా ఉన్నారు. దీంతో నెల్సన్ సూర్యతో ఈ మూవీ తీయబోతున్నట్లు కోలీవుడ్ టాక్. ప్రస్తుతానికి నెల్సన్, సూర్య, నిర్మాణ సంస్థ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. 

Also Read : Thankyou Subbarao OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ - అమ్మాయిల హత్యల మిస్టరీ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.