Surya Hindi Fim : తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధ నటులలో సూర్య ఒకడు. అతని అద్భుతమైన నటనకు గానూ ఆయనకు జాతీయ స్థాయిలో ప్రశంసలు కూడా వచ్చాయి. ఆయన నటించిన 'సింగం' ఫ్రాంచైజీ హిందీలో విడుదలై ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత 'సూరరై పొట్రు' సినిమాతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ప్రస్తుతం సూర్య.. శివ దర్శకత్వం వహిస్తోన్న 'కంగువ' మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా 2024 సమ్మర్‌లో పాన్ ఇండియా రేంజ్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో సూర్య గురించి ఓ క్రేజీ అండ్ ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. దర్శకుడు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రాతో సూర్య అడ్వాన్స్‌డ్ చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సూర్య ఈ సినిమాతో హిందీలో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడంటూ పలు నివేదికలు వెల్లడించాయి.


సూర్య, రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా 'కర్ణ' కోసం కొంతకాలంగా చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా ఈ ఇతిహాస కథను రెండు భాగాల ఎపిక్‌ గా నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది మహాభారత కాలంలో జరిగిన సన్నివేశాలను ఆధారంగా చేసుకుని దర్శకుడు రాకేష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపై సూర్య కూడా అత్యంత ఆసక్తి కనబరుస్తున్నట్టు సమాచారం. తన కెరీర్‌లోనే అత్యంత సంక్లిష్టమైన పాత్రలలో ఒకటైన ఈ 'కర్ణ' పాత్రను పోషించేందుకు ఉత్సాహంగా ఉన్నట్టు తెలుస్తోంది.


ఈ చిత్రం 2024లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. 'కర్ణ' కంటే ముందే సూర్య, సుధా కొంగరతో 'కంగువ' షూటింగ్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. 'కర్ణ' అనేది రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా డ్రీమ్ ప్రాజెక్ట్. అతను కొంతకాలంగా ఈ ప్రాజెక్ట్ పై పని చేస్తున్నాడు. ఈ చిత్రం ఖచ్చితంగా భారతదేశంలోనే ఓ గేమ్ ఛేంజర్‌గా మారే అవకాశం ఉందని సినీ నిర్మాతలు నమ్ముతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే సూర్య కెరీర్ లో ఇంత క్లిష్టమైన పాత్రను ఇప్పటివరకు ఎవరూ చూపించలేదు. చిత్రంగా తీయాలని ప్రయత్నించలేదు.  


పాన్ ఇండియా సినిమాగా కర్ణ


'కర్ణ' పలు భాషలలో పాన్-ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని అన్ని చిత్ర పరిశ్రమల్లో ప్రదర్శించేందుకు మేకర్స్ ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి చాలా సమావేశాలు, చర్చలు జరిగిందున, హిందీలో ఈ చిత్రంతో ఆయన అరంగేట్రం చేయడానికి ఇదే సరైన సబ్జెక్ట్ అని సూర్య భావిస్తున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి.


ప్రాంతీయ అడ్డంకులు ఛేదించి, దక్షిణాదికి చెందిన చాలా మంది నటీనటులు పాన్ ఇండియా రేంజ్ లో హిందీ చిత్రనిర్మాతలతో కలిసి పనిచేస్తున్నారు. టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ జూనియర్.. హృతిక్ రోషన్‌తో కలిసి 'వార్ 2'తో హిందీలో అరంగేట్రం చేస్తుండగా, అల్లు అర్జున్ ఆదిత్య ధర్‌తో చిరంజీవి 'అశ్వత్థామ' గురించి చర్చలు జరుపుతున్నాడు. రామాయణంలో రావణుడిగా నటించడానికి యష్ కూడా నితీష్ తివారీతో చర్చలు జరుపుతుండడం చెప్పుకోదగిన విషయం.


Read Also : Hyderabad: లవ్ బర్డ్స్ లావణ్య, వరుణ్ తేజ్‌ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా? తప్పకుండా షాకవుతారు