Superman First Look Released: సూపర్ మ్యాన్ సినిమాలంటే చాలామంది ప్రేక్షకులకు ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. ఈ సినిమాలను హాలీవుడ్ మేకర్స్ తెరకెక్కించినా కూడా ప్రపంచవ్యాప్తంగా దీనికి ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికే ఈ సూపర్ మ్యాన్ ప్రపంచంలో ఎంతోమంది హాలీవుడ్ నటులు యాడ్ అయ్యారు. త్వరలో జేమ్స్ గన్ తెరకెక్కించనున్న మరో సూపర్ మ్యాన్ సినిమాలో డేవిడ్ కారెన్స్‌వెట్.. మ్యాన్ ఆఫ్ స్టీల్‌గా కనిపించనున్నాడు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ తాజాగా విడుదలయ్యింది. ఫస్ట్ లుక్‌తో పాటు ‘సూపర్ మ్యాన్’ మూవీ రిలీజ్ డేట్‌ను కూడా ఈ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ప్రకటించారు మేకర్స్.


ప్రేక్షకుల విమర్శలు..


ఇప్పటివరకు హాలీవుడ్ ప్రేక్షకులకు సూపర్ మ్యాన్ అనగానే వెంటనే గుర్తొచ్చేది క్లార్క్ కెంట్ మాత్రమే. ఇప్పుడు ఆ స్థానంలోకి డేవిడ్ కారెన్స్‌వెట్ రావడాన్ని కొందరు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అందుకే ఈ ఫస్ట్ లుక్‌పై తీవ్రమైన విమర్శలు కురిపిస్తున్నారు. మరికొందరు మాత్రం హీరో ఎవరైనా పరవాలేదు. కానీ ఇలాంటి ఒక హిట్ ఫ్రాంచైజ్ మూవీకి ఇంత సింపుల్ ఫస్ట్ లుక్ కరెక్ట్ కాదని మరికొందరు అంటున్నారు. చాలా తక్కువమంది నెటిజన్లు మాత్రమే ‘సూపర్ మ్యాన్’ మూవీ విషయంలో ఎగ్జైట్మెంట్ చూపిస్తున్నారు. ఎంతైనా డేవిడ్ కారెన్స్‌వెట్‌కు ఇది కెరీర్‌లోనే పెద్ద బ్రేక్ అని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


వచ్చే ఏడాది..


‘సూపర్ మ్యాన్’ మూవీలో డేవిడ్ కారెన్స్‌వెట్‌తో పాటు రేచెల్ బ్రోస్నాహా, నికోలస్ హాల్ట్, నాథన్ ఫిల్లియోన్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో డేవిడ్ కారెన్స్‌వెట్.. తన సూపర్ మ్యాన్ సూట్‌లో షూ వేసుకుంటూ కనిపిస్తాడు. తన వెనుక ఆకాశంలో పెద్ద మెరుపు కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే సూపర్ మ్యాన్.. తన తరువాతి మిషిన్ కోసం సిద్ధమవుతున్నాడని అర్థమవుతోంది. ఇక ఈ ఫస్ట్ లుక్‌తో పాటు ‘సూపర్ మ్యాన్’ రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు మేకర్స్. 2015 జులై 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ‘సూపర్ మ్యాన్’ సందడి చేయనున్నాడని పేర్కొన్నారు.






బిగ్ బ్రేక్..


డేవిడ్ కారెన్స్‌వెట్.. సినిమాల కంటే వెబ్ సిరీస్‌లతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. 2019లో విడుదలయిన ‘ది పొలిటీషియన్’ అనే వెబ్ సిరీస్.. డేవిడ్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వరుసగా వెబ్ సిరీస్, సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చేలా చేసింది. ‘లుక్ బోత్ వేస్’, ‘పర్ల్’ లాంటి చిత్రాలతో హాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడ్డాడు డేవిడ్. 2024లో ఇప్పటికే ‘ది గ్రేటెస్ట్ హిట్స్’ అనే అందమైన లవ్ స్టోరీతో ప్రేక్షకులను మెప్పించిన డేవిడ్.. ఇప్పుడు జేమ్స్ గన్ దర్శకత్వంలో ఏకంగా ‘సూపర్ మ్యాన్’గా నటించే అవకాశాన్ని కొట్టేశాడు. ‘సూపర్ మ్యాన్’తో పాటు ‘ట్విస్టర్స్’ అనే మరో భారీ బడ్జెట్ మూవీలో కూడా డేవిడ్ కారెన్స్‌వెట్ హీరోగా కనిపించనున్నాడు.



Also Read: ‘పుష్ప’ నన్ను ఎక్కడికో తీసుకెళ్తుందని అనుకోవడం లేదు, నా బలం మలయాళం సినిమా - ఫాహద్ ఫాజిల్