మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు... ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తే బావుంటుందని కొంత మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. 'ఆచార్య' స్టార్ట్ కావడానికి ముందు ఈ కాంబినేషన్ ఆల్మోస్ట్ ఓకే అయ్యిందని భావించారంతా! 'ఆచార్య'లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన పాత్రకు ముందు మహేష్ బాబును అప్రోచ్ అయ్యారనే మాటలు వినిపించాయి. అయితే, ఆ పాత్రలో చివరకు చిరు తనయుడు నటించారు.
లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... 'ఆచార్య'లో మహేష్ నటించలేదు. సో.. సినిమాలో ఆయన కనిపించే అవకాశాలు లేవు. కానీ, ఆయన వినిపిస్తుంది. ఈ సినిమాకు మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. దర్శకుడు కొరటాల శివ, మహేష్ బాబు మధ్య మంచి అనుబంధం ఉంది. వీళ్ళిద్దరూ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేశారు. మెగా ఫ్యామిలీతో, రామ్ చరణ్‌తోనూ మహేష్‌కు ఫ్రెండ్షిప్ ఉంది. అందువల్ల, వాయిస్ ఓవర్ ఇవ్వమని అడిగిన వెంటనే ఓకే చెప్పేశారట. ఆల్రెడీ డబ్బింగ్ కూడా ఫినిష్ చేశారని తెలిసింది.
Also Read: డెలివరీ తర్వాత గ్లామరస్‌గా ఉండదు. కానీ, అందంగా ఉంటుంది - కాజల్ భావోద్వేగభరిత లేఖ
చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల (Surekha Konidala) సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి 'ఆచార్య' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించారు. ఈ నెల 29న సినిమా (Acharya On April 29) విడుదల కానుంది.
Also Read: 'ఓ మై డాగ్' రివ్యూ: సూర్య, జ్యోతిక నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?