సింగిల్ స్క్రీన్స్ ఓనర్లు తమకు పర్సెంటేజ్ సిస్టమ్ కావాలని డిమాండ్ చేయడంతో కొన్ని రోజులుగా తెలుగు చిత్రసీమలో వాడీవేడి చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వరుస వివాదాల నేపథ్యంలో తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TSFCC) అధ్యక్ష పదవికి ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్, ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ (Suniel Narang) రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన రాజీనామాకు 'పెద్ది' సమస్యలే కారణమా? అని డిస్కషన్ కూడా జరుగుతోంది.  

సునీల్ నారంగ్ రాజీనామాకు కారణం ఏమిటి?Reason For Suniel Narang Resign: తెలుగు చిత్రసీమలో 'థియేటర్ కలెక్షన్స్ షేరింగ్ వర్సెస్ పర్సంటేజీ' విషయంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య వివాదం నడుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' విడుదలకు ముందు, ఆ సినిమాను టార్గెట్ చేస్తూ సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ ఓనర్లు షేరింగ్ డిమాండ్ తీసుకు వచ్చారని నిర్మాతల నుంచి విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. తర్వాత 'పెద్ది' విడుదలకు లైన్ క్లియర్ అంటూ ఓ లేఖ వచ్చింది. తర్వాత అందులో విషయాలు ఫైనల్ కాదంటూ ప్రముఖ నిర్మాత, ఛాంబర్ ప్రెసిడెంట్ సురేష్ బాబు నుంచి మరొక లేఖ వచ్చింది. ఈ తరుణంలో సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. సో... ఆ ఇష్యూలే కారణమని ప్రచారం జరుగుతోంది.

Also Read: Naga Vamsi Vs Asian Suniel - ఖతమ్ చేస్తా బిడ్డా... కొట్టుకోవడం ఒక్కటే తక్కువ - ఛాంబర్ మీటింగ్‌లో నాగవంశీ vs ఏషియన్ సునీల్

రాజీనామా లేఖలో సునీల్ నారంగ్ పలు అంశాలు ప్రస్తావించారని తెలిసింది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్‌లోని కొందరు ఆఫీస్ బేరర్ల నుంచి తనపై విపరీతమైన ఒత్తిడి వస్తోందని, వాళ్ళకు నచ్చేలా - మెప్పించేలా నిర్ణయాలు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మనస్సాక్షికి విరుద్ధంగా ఇక్కడ పని చేయలేనని సునీల్ నారంగ్ స్పష్టం చేశారు. ఛాంబర్ నిర్ణయాలు ఏకాభిప్రాయంతో జరగాలని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కావడం లేదని ఆయన పేర్కొన్నారు.

Also Read: Dragon Glimpse Decoded - ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్‌లో హిడెన్ డీటెయిల్స్... ప్రశాంత్ నీల్ సీక్రెట్ క్లూస్ గమనించారా?

నిర్మాతలు మైత్రీ రవిశంకర్, సూర్యదేవర నాగవంశీతో విభేదాలు కూడా సునీల్ నారంగ్ రాజీనామాకు కారణమని ఫిల్మ్ నగర్ గుసగుస. ఛాంబర్ మీటింగ్‌లో వాళ్ళ మధ్య గొడవ కూడా జరిగిందని టాక్. కొంత మంది నుంచి ఎదురైన ఒత్తిళ్లతో పాటు కొంత కాలంగా తన ఆరోగ్య పరిస్థితి కూడా ఆశించిన స్థాయిలో సహకరించడం లేదని తన రాజీమానా లేఖలో సునీల్ నారంగ్ వెల్లడించారు. ఛాంబర్ కార్యకలాపాలకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో శేఖర్ లేదా విజేందర్‌లను అధ్యక్షులుగా నియమించాలని సునీల్ నారంగ్ పేర్కొన్నారు.

సునీల్ నారంగ్ రాజీనామాను ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తక్షణమే ఆమోదం తెలిపింది. ఆయనను బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల చిత్రసీమలో జరిగిన పరిణామాల నేపథ్యంలో సునీల్ నారంగ్ హఠాత్తుగా రాజీనామా చేయడం పరిశ్రమ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

Also ReadDragon Glimpse vs Peddi Trailer - డ్రాగన్ గ్లింప్స్‌ vs పెద్ది ట్రైలర్... ఏది బావుంది? ఎన్టీఆర్ vs రామ్ చరణ్... ఎవరిది అప్పర్ హ్యాండ్?