Sundeep Kishan: ఏదైనా సినిమాలలో ఇద్దరు హీరోలు నటిస్తున్నారంటే ఆ సినిమాపై అంచనాలు పెరుగుతూ ఉంటాయి. ఇక ఆ సినిమాలో ఇద్దరు హీరోలు అన్నదమ్ముల పాత్రలో చేస్తే క్రేజ్ మరింత హై లో ఉంటుంది. ఇప్పటికే అటువంటి కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. అయితే తాజాగా సందీప్ కిషన్, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ లు ఈ కాంబినేషన్ లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.


టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అని చెప్పాలి. వరుస సినిమాలు చేసినప్పటికీ కూడా స్టార్ హోదాకు మాత్రం చేరుకోలేకపోతున్నాడు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ సినిమాలలో కూడా నటించాడు. సందీప్ కిషన్ గతంలో సహాయక దర్శకుడిగా కూడా పనిచేశాడు.


సందీప్ తొలిసారిగా 2008లో ’స్నేహ గీతం‘ అనే సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టాడు సందీప్. ఆ తర్వాత వరుసగా చిన్న చిన్న సినిమాలు చేస్తూ కొంత క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక 2013 లో వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమా తనకు మరింత గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అయినప్పటికీ కూడా ఈయనకు అవకాశాలు వస్తూనే ఉన్నాయని చెప్పాలి. ఇక రీసెంట్ గా ’ఊరు పేరు భైరవకొండ’ అనే సినిమాలో కూడా నటించగా ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇక ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలలో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ధనుష్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో నటనపరంగా మంచి పేరు సంపాదించుకున్నాడు. కోలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోగా ఎదిగాడు. రీసెంట్గా సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ధనుష్.


ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. అయితే ధనుష్ ప్రస్తుతం తన 50వ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసింది. దీనికి D50 అని పేరు పెట్టి సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్నాడని తెలిసింది. అయితే తాజాగా ఈ సినిమా నుండి మరో విషయం బయటపడింది. అదేంటంటే ఈ సినిమాలో ధనుష్ సోదరుడుగా సందీప్ కిషన్ నటించనున్నట్లు తెలుస్తుంది.


ఇప్పటికే ధనుష్, సందీప్ కిషన్ ఇద్దరు కలిసి కెప్టెన్ మిల్లర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ధనుష్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా నిర్మాణంలో ఉంది. అయితే ఈ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం పట్ల ధనుష్ D50 లో సందీప్ కిషన్ కు అవకాశం ఇచ్చినట్లు ప్రచారం నడుస్తుంది. ఇక ఈ సినిమాకు రాయన్ అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే ఇందులో సందీప్ కిషన్ నటిస్తున్నాడన్న వార్త ఎంత వరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం బాగా వైరల్ అవుతుంది.


Also Read:  తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయట పెట్టలేని జానకి - మలయాళంకు చుక్కలు చూపించిన మల్లిక