Satyadev's Rao Bahadur First Review : యంగ్ హీరో సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ వెంకటేశ్ మహా దర్శకత్వంలో రాబోతోన్న సైకలాజికల్ ఎమోషనల్ డ్రామా రావు బహదూర్. ఇప్పటికే రిలీజైన టీజర్ భారీ హైప్ క్రియేట్ చేస్తుండగా... జులై 3న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా చూసి ప్రశంసలు కురిపించగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ తాజాగా రావు బహదూర్ చూసి రివ్యూ ఇచ్చారు.
'అసూయ పడే పాత్ర'
భారతీయ చిత్ర సీమలో ఇలాంటి సినిమా ఎప్పుడూ రాలేదని చెప్పారు సుకుమార్. మూవీ టీంతో కలిసి సినిమా చూసిన ఆయన... డైరెక్టర్ వెంకటేశ్ మహా, హీరో సత్యదేవ్‌పై ప్రశంసలు కురిపించారు. 'రావు బహదూర్ సత్యకు ఓ గొప్ప గిఫ్ట్. ఏ యాక్టర్‌కు ఇంతలా ఇన్ని వేరియేషన్స్‌లో నటించే ఛాన్స్ లభించదు. ప్రతీ నటుడు అసూయపడే పాత్ర. భారతీయ చిత్రసీమలో ఇంతకు ముందు ఇలాంటి సినిమా ఎప్పుడూ రాలేదు. వెంకటేశ్ మహా ఎక్కువ టైం తీసుకున్నప్పటికీ ఫైనల్‌గా సక్సెస్ సాధించారు.
ప్రతీ విభాగం బెస్ట్‌గా పని చేసింది. వెండితెరపై ఇలాంటి కథను తీసుకురావడం చాలా కష్టమైన పని. సినిమా చూస్తున్నంత సేపు నేను లీనమైపోయా. నన్ను మైమరిపించింది. ఇలాంటి చిత్రాన్ని నిర్మించిన అనురాగ్ గొప్పవాడు. ఆయనకు ఈ స్టోరీ ఎలా అర్థమైందో నాకు తెలీదు. ఆయన లాంటి నిర్మాత దొరకడం వెంకటేశ్ అదృష్టం.' అని చెప్పారు.
Also Read : Varanasi Plot : వారణాసి స్టోరీ లీక్ - ఈ ప్లాట్ అస్సలు ఊహించలేదు... రాజమౌళి చెప్పిన సీక్రెట్స్ ఏంటంటే?
మహేశ్ బాబు రివ్యూ
రావు బహదూర్ సినిమా చూసిన మహేశ్ బాబు రెండు రోజుల క్రితం ట్విట్టర్ వేదికగా రివ్యూ ఇచ్చారు. 'వెంకటేశ్ మహా అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించారు. సత్యదేవ్ ఆ ప్రపంచాన్ని తనదైన శైలిలో తన ఆధీనంలోకి తీసుకున్నారు. హీరోయిన్ దీపా థామస్ కూడా ఎంతో అద్భుతంగా నటించారు. మూవీ టీం మొత్తానికి చాలా గర్వంగా ఉంది. టెక్నికల్ టీం శ్రమ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆడియన్స్ ఈ కొత్త తరహా ఎక్స్‌పీరియన్స్‌ను థియేటర్లలో తప్పకుండా ఆస్వాదిస్తారు.' అంటూ రాసుకొచ్చారు.
ఈ మూవీలో సత్యదేవ్‌తో పాటు దీప థామస్, వికాస్ ముప్పాళ్ల, బాలా పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్ కీలకపాత్రలు పోషించారు. సినిమాను మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్‌ల GMB ఎంటర్టైన్మెంట్ సమర్పణలో A+S మూవీస్, శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా... చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మిస్తున్నారు.
Also Read : Divija Prabhakar: హీరోయిన్‌గా బుల్లితెర మెగాస్టార్ కూతురు... పవన్ సూపర్ హిట్ సాంగ్ టైటిల్‌తో సినిమా!
