Pushpa 2 Director Sukumar Prises on Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. అదేంటి ఇంకా సినిమా విడుదలవ్వడానికి దాదాపు 15 రోజుల టైమ్ ఉంది కదా. అప్పుడే రివ్యూ ఎలా వచ్చేసిందని అనుకుంటున్నారా? సినిమా ఎక్కడా విడుదల కాలేదు కానీ.. ఎడిటింగ్ రూమ్‌లో సినిమా ఉండగానే కొంత మంది టెక్నీషియన్స్‌కి సినిమా చూసే అవకాశం ఉంటుంది. రామ్ చరణ్ సినిమా అనగానే మెగాస్టార్ చిరంజీవి కూడా ఎడిటింగ్ రూమ్‌లో ఉండగానే సినిమా చూసి ఏవైనా సజెషన్స్ చెబుతారనేలా ఇప్పటికే ఎన్నో సార్లు వార్తలు వచ్చాయి. అలా మెగాస్టార్ చిరంజీవితో కలిసి డైరెక్టర్ సుకుమార్ ఈ ‘గేమ్ చేంజర్’ సినిమాను చూశారట. ఆ విషయం స్వయంగా ఆయనే చెప్పారు.


డల్లాస్‌లో జరిగిన ‘గేమ్ చేంజర్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో సుకుమార్ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి సినిమా చూశానని చెబుతూ.. సినిమాలో హైలెట్స్.. అదే సినిమా రివ్యూని స్టేజ్‌పై చెప్పేశారు. అలాగే ఏ హీరోతోలేని అనుబంధం తనకు రామ్ చరణ్‌తో ఉందని కూడా సుక్కు చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో సుకుమార్ ‘గేమ్ చేంజర్’ గురించి చెబుతూ..


Also Read: Hyderabad CP CV Anand: సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్


‘‘మీకో రహస్యం చెప్పాలి. చిరంజీవి సార్‌తో కలిసి నేను ‘గేమ్ చేంజర్’ సినిమా చూశాను. కాబట్టి.. ఫస్ట్ రివ్యూ నేనే ఇస్తా. ఫస్టాఫ్ అద్భుతం, ఇంటర్వెల్ బ్లాక్‌బస్టర్. సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ చూస్తే గూస్‌బంప్స్.. ఫినామినల్. నేను శంకర్‌గారి ‘జెంటిల్‌మ్యాన్, భారతీయుడు’ సినిమా చూసి ఎంత ఎంజాయ్ చేశానో.. మళ్లీ ఈ సినిమా చూసి అంత ఎంజాయ్ చేశా. ‘రంగస్థలం’ సినిమాకు కచ్చితంగా రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డ్ వస్తుందని అనుకున్నాను. అందరూ అనుకున్నారు. కానీ రాలేదు. ఈ సినిమా క్లైమాక్స్‌లో తన ఎమోషన్ చూసినప్పుడు నాకు మళ్లీ అదే ఫీలింగ్ కలిగింది. ఇంకా చెప్పాలంటే అంతకంటే గొప్పగా అనిపించంది. తను ఎంతబాగా చేశాడంటే.. కచ్చితంగా తన నటనతో ఈసారి నేషనల్ అవార్డు అందుకుంటాడు..’’ అని ‘గేమ్ చేంజర్‌’పై సుకుమార్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు.






ఇక రామ్ చరణ్‌తో తన అనుబంధం గురించి చెబుతూ.. ‘‘నేను ఏ హీరోతో సినిమా చేస్తున్నా.. ఆ హీరోని చాలా ప్రేమిస్తాను. ఒక సినిమా చేసేటప్పుడు ఎవరిమధ్య అయినా ఒక సంవత్సరం లేదంటే రెండు సంవత్సరాలు అనుబంధం ఉంటుంది. నాతో మూడు సంవత్సరాలు ఉంటుంది. కానీ ఒక్కసారి సినిమా పూర్తయిన తర్వాత నేను ఎవరితోనూ కనెక్ట్ కాను. ‘రంగస్థలం’ పూర్తయిన తర్వాత ఆ అనుబంధం అలాగే కొనసాగించిన ఒకే ఒక్క హీరో చరణ్. అతను నాకు సోదరుడు. నేను అన్నింటికంటే ఎక్కువగా అతన్ని ప్రేమిస్తాను. మేము ఈ విషయం ఎక్కడా చెప్పలేదు కానీ, మేము చాలా సార్లు కలుస్తూ ఉంటాం. ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటాం. అంత ఇష్టం నాకు చరణ్ అంటే..’’ అని రామ్ చరణ్‌పై తన ప్రేమను తెలియజేశారు. చరణ్‌తో పాటు ఎస్ జె సూర్య, అంజలి వంటి వారిని కూడా సుకుమార్ అభినందించారు.



Also Read : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్!