Prasanna Vadanam OTT Partner and Streaming Details: మొదట క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, ఆ తర్వాత హీరో ఇలా పాత్ర ఏదైనా తనదైన సహజ నటనతో మెప్పిస్తున్నాడు సుహాస్. 'కలర్‌ ఫోటో'తో హీరోగా మారిన అతడు వరుస విజయాలతో దూసుకు‌పోతున్నాడు. హిట్‌ 2 నెగిటివ్‌ షేడ్‌లో నటించిన అతడికి విలన్‌గానూ మంచి పేరు వచ్చింది. ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే.. వీలు చిక్కినప్పుడల్లా హీరోలకు ఫ్రెండ్‌ పాత్రలు పోషిస్తున్నాడు. అలా హరోగా, ఫ్రెండ్‌గా, విలన్‌గా‌ సుహాస్‌ కెరీర్‌ ప్రస్తుతం పీక్స్‌లో ఉందని చెప్పాలి. ఇక లీడ్‌ యాక్టర్‌గా సుహాస్‌ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.


ఇప్పటికే హ్యాట్రిక్‌  హిట్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్న అతడు తాజాగా 'ప్రసన్న వదనం' మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. క్రియేటివ్ డైరెక్టర్‌ సుకుమార్ శిష్యుడు అర్జున్ వైకె  దర్శకత్వం తెరకెక్కిన ఈ సినిమా మే 3న థియేటర్లోకి వచ్చింది. ప్రస్తుతం థియేటర్లో రన్‌ అవుతున్న ఈ సినిమా ఓటీటీ అప్‌డేట్‌పై బజ్‌ నెలకొంది. ప్రసన్న వదనం డిజిటల్‌ ప్రిమియర్‌ గురించి తాజాగా ఓ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రిలీజ్‌కు ముందే ఈ మూవీ ఓటీటీ పార్ట్‌నర్‌ లాక్ చేసుకుందట. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ని ప్రముఖ తెలుగు డిజిటల్‌ సంస్థ ఆహా  రీసెంట్‌ ప్రైజ్‌కి సొంతం చేసుకుందని సమాచారం.


థియేట్రికల్‌ రన్‌ అనంతరం ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్‌ చేస్తారని, త్వరలోనే డిజిటల్ ప్రీమియర్‌కి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం. కాగా సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో సుహాస్‌కు సరసన పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా నటించింది. రాశీసింగ్, నందు, వైవా హర్ష, సాయి శ్వేత, నితిన్ ప్రసన్నలు ముఖ్య పాత్రలు పోషించారు. ఫేస్‌ బ్లైండ్‌ అనే సరికొత్త కాన్సెప్ట్‌తో సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా అర్జున్ వైకె ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు టీజర్‌, ట్రైలర్లు మంచి రెస్సాన్స్‌ రావడంతో మూవీపై అంచనాలు పెరిగాయి. అలా భారీ అంచనా మధ్య థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం మరి ప్రేక్షకులు ఎలా మెప్పిస్తుందో చూడాలి. 



ఇక కథ విషయానికి వస్తే.. 


చిన్నతంలో జరిగిన ఓ యాక్సిడెంట్‌లో హీరో సూర్య(సుహాస్‌) తన తల్లిదండ్రులను కోల్పోతాడు. ఈ ప్రమాదం వల్ల అతడు ఫేస్‌ బ్లైండ్‌ నెస్‌ (ప్రోసోపాగ్నోసియా) అనే వ్యాధి బారిన పడతాడు. ఈ వ్యాధి లక్షణం ఉన్నవారు మనుషుల మొహాలను గుర్తుపట్టలేరు. వారి వాయిస్‌ కూడా గుర్తుపట్టలేరు. అలా అరుదన వ్యాధి ఉన్న సూర్య ఆర్జేగా పనిచేస్తూంటాడు. సూర్యకు ఈ సమస్య ఉన్నట్టు తన ఫ్రెండ్‌ విగ్నేష్(వైవా హర్ష)కి తప్ప మరెవరికి తెలియదు. అలా తన వ్యాధిని ఎవరికి తెలియకుండ మెయింటైన్‌ చేస్తుంటాడు. ఈ క్రమంలో వచ్చే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తుంటాయి. ఈ క్రమంలో ఒకరోజు అతడికి ఆద్య(పాయల్) పరిచయం అవుతుంది. రోజు తనని కలుస్తున్న తనని గుర్తుపట్టలేకపోతాడు సూర్య. అలా కొన్ని సంఘటనల తర్వాత ఇద్దరి మధ్య పరిచయం, ప్రేమగా మారుతుంది. అదే టైంలో సూర్య ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఆ మర్డర్‌ని స్వయంగా చూసిన అతడు ఈ కేసులో నిందితుడు ఎలా అయ్యాడు? ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు? హత్యకు గురైన అమ్మాయి ఎవరనేది తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


Also Read: వరంగల్‌ గుడిలోనే ఎందుకు నిశ్చితార్థం? - అసలు విషయం చెప్పిన అదితి