Harom Hara Movie Release on May 31st 2024: సినిమా హిట్‌, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తున్నాడు హీరో సుధీర్‌ బాబు. ప్రేమ కథా చిత్రం, వీ చిత్రాల తర్వాత సుధీర్‌ బాబు కెరీర్‌లో చెప్పుకొదగ్గ హిట్‌ లేదు. కానీ వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇక ఈసారి ‘హరోం హర’ అంటూ పాన్‌ ఇండియా మూవీతో రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార పోస్టర్స్‌, ఫస్ట్‌లుక్‌ మూవీ అంచనాలు పెంచేస్తున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా కీలక అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌.


ఈ సినిమాను సమ్మర్‌ కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు. మే 31న ‘హరోం హర’ మూవీని విడుదల చేయబోతున్నట్టు తాజాగా మేకర్స్‌ అధికారిక ప్రకటన ఇచ్చారు. అయితే ఆ రోజు దివంగత నటుడు, సూపర్‌ స్టార్‌ కృష్ణ జయంతి కావడం విశేషం. కాగా సుధీర్‌ బాబుకు తన మామగారు సూపర్‌స్టార్ కృష్ణ అంటే ఎంత గౌవరం ప్రత్యేకం చెప్పనవసరం లేదు. ఆయనకు సంబంధించిన స్పెషల్‌ డేస్‌లో సుధీర్‌ బాబు తనకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు, సినిమాలకు సంబంధించి అప్‌డేట్స్‌ ఇస్తుంటాడు. ఇప్పుడు కూడా తన మామగారు కృష్ణ జయంతి సందర్భంగా తన పాన్‌ ఇండియా మూవీ ‘హరోం హర’ సినిమా రిలీజ్‌ చేస్తుండటం విశేషం.