Shraddha Kapoor’s Stree 2 Teaser Looks Impressive: బాలీవుడ్ స్టార్ శ్రద్దా కపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించిన చిత్రం ‘స్త్రీ‘. 2018లో విడుదలై ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సుమారు 6 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ గా ‘స్త్రీ2‘  తెరకెక్కింది. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం టీజర్ ను విడుదల చేసింది. స్త్రీ అనే ఒక పవర్ మగాళ్లను ఎలా భయపెడుతుంది? అనేది ఈ టీజర్ లో చూపించారు.  


పవర్ ఫుల్ రోల్ లో శ్రద్ధా కపూర్


‘స్త్రీ’ సినిమాలో శ్రద్ధా కపూర్ పాత్ర మిస్టరీగా మిగిలిపోతుంది. సీక్వెల్ లో మాత్రం పవర్ ఫుల్ రోల్ లో ప్రేక్షకులను భయపెట్టబోతోంది. తాజాగా విడుదలైన టీజర్ లో హీరో రాజ్ కుమార్, నటులు పంకజ్ త్రిపాఠి, అపర శక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ సహా పలువురు కనిపించారు. స్త్రీ అనే ఒక పవర్ మగాళ్లను ఎలాంటి భయభ్రాంతులకు గురి చేసింది? స్త్రీ కోపం ఎంత భయంకరంగా ఉంటుంది? అనేది ఈ చిత్రంలో చూపించబోతున్నారు మేకర్స్. కామెడీ, హార్రర్ అంశాలను బేస్ చేసుకుని ఈ సినిమాను రూపొందించారు.


Also Read: ప్రభాస్ ఒక్కో సినిమాకు ఏవరేజ్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 300 కోట్లు... ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే రేంజ్‌ డార్లింగ్స్.... రెబల్ స్టార్‌ను 'ఢీ' కొట్టేదెవరు






మూడు వారాల్లో రూ. 100 కోట్లు వసూళు


2018లో విడుదలైన ‘స్త్రీ’ సినిమా ప్రేక్షకులు అద్భుతంగా అలరించింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. హారర్, కామెడీ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాను చూసేందుకు అప్పట్లో ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు. ఈ మూవీ విడుదలైన మూడు వారాల్లో రూ. 100 కోట్లు వసూలు చేసి సత్తా చాటింది. మళ్లీ 6 సంవత్సరాల గ్యాప్ తర్వాత ‘స్త్రీ 2’ సినిమా రాబోతోంది. తొలి సినిమాకు కొనసాగింపుగా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. “ఆ ‘స్త్రీ’ 6 ఏళ్ల తర్వాత మళ్లీ వస్తోంది” అంటూ శ్రద్ధా కపూర్ టీజర్ ను షేర్ చేసింది. టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ‘స్త్రీ 2’ సినిమా అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. మడాక్ ఫిలింస్ బ్యానర్ పై దినేష్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగష్టు 15న విడుదల కాబోతోంది. ఈ మూవీలో తమన్నా కూడా కీలక పాత్ర పోషిస్తున్నది. తాజాగా విడుదలైన టీజర్ లో ఆమె కూడా కనిపించడం విశేషం.



Read Also: ఏపీలో 'కల్కి 2898 ఏడీ' టికెట్ రేట్స్ పెరిగాయ్ - తెలంగాణలో కంటే ఎక్కువ రోజులు, ఎక్కువ రేట్లు