Mahesh Babu As Rudra In Rajamouli SSMB29 Project: ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మూవీ 'SSMB29'. దర్శక దిగ్గజం రాజమౌళి (Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబోలో 'SSMB29' వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో మహేష్ 'రుద్ర'గా (Rudra) కనిపించనున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు ఏ క్యారెక్టర్ చేసినా ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అప్పటి 'పోకిరి' నుంచి మొన్నటి 'గుంటూరు కారం' వరకూ ఆయన క్యారెక్టర్ పేర్లలో ఓ యునిక్ నెస్ ఉంటుంది. అతడులో 'పార్థు', ఖలేజాలో 'సీతారామరాజు', పోకిరీలో 'పండు', గుంటూరు కారంలో 'రమణ'గా అలరించారు. ఇక.. జక్కన్న, మహేష్ బాబు మూవీ గురించి ఎలాంటి చిన్న అప్ డేట్ ఇప్పటివరకూ రాలేదు. ఈ క్రమంలో సినిమా గురించి ఓ చిన్న గాసిప్ వచ్చిన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇటీవల హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో 12 రోజుల పాటు షూటింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా పాల్గొన్నట్లు సమాచారం.
ఒడిశాకు మహేష్ బాబు
ఇటీవల మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఈ సినిమాలో ఎంపికైనట్లు తెలుస్తోంది. తాజాగా.. ఎయిర్ పోర్టులో మహేష్ బాబు (Mahesh Babu), పృథ్వీరాజ్ ఫోటోలు వైరల్‌గా మారాయి. ఇందులో ఇరువురు స్టార్లు పోలీస్ అధికారులకు కరచాలనం చేస్తూ కనిపించారు. వీరిద్దరూ ఒడిశాలో 'SSMB29' మూవీ కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పటివరకూ ఈ ప్రాజెక్టు గురించి ఎలాంటి న్యూస్ కూడా బయటకు రాలేదు. చివరకు ప్రియాంక చోప్రా సైతం ఇందులో నటిస్తున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆమె మదర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దానికి మరింత బలాన్నిచ్చాయి. ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి లీక్స్ లేకుండా రాజమౌళి టీం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఒడిశాలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కాగా.. అక్కడ మరో 15 రోజులు షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా గురించి ఏ చిన్న హింట్ బయటకు వచ్చినా అది క్షణాల్లోనే ట్రెండింగ్ అవుతోంది. దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్‌గా.. ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహస ప్రయాణంగా రూపొందుతోందని తెలుస్తోంది. ఈ కథలో కొంతభాగం కాశీలో జరుగుందని సమాచారం. దీంతో ఏకంగా కాశీ సెట్‌నే హైదరాబాద్‌లో షూటింగ్ కోసం వేశారట. ముఖ్యంగా వారణాసిలోని మణికర్ణిక ఘాట్ సెట్స్ వేశారనే టాక్ వినిపిస్తోంది. ఇండియాతో పాటు సౌత్ ఆఫ్రికా, యూరోప్ దేశాల్లో షూటింగ్ చేయనున్నట్లు ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది.