Rajamouli Special Post About Big Surprise Before GlobeTrotter Event : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి 'GlobeTrotter' ఈవెంట్ కోసం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో సర్వం సిద్ధమైంది. ఈవెంట్‌కు ముందో జక్కన్న సోషల్ మీడియా వేదికగా బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. అసలు ఈ రోజు ఏం రివీల్ చేస్తున్నామో చెప్తూ ఓ పోస్ట్ చేశారు.
భారతీయ సినిమా చరిత్రలోనే ఓ మూవీ ఫస్ట్ లుక్ కోసం ఇంతటి భారీ స్థాయిలో ఈవెంట్ ప్లాన్ చేయడం ఇదే తొలిసారి. ఇండస్ట్రీతో పాటు యావత్ సినీ ప్రపంచం ఈ వేడుక కోసం వెయిట్ చేస్తున్నారు. SSMB29 నుంచి ఎలాంటి సర్‌ప్రైజెస్ రానున్నాయో అనే ఆసక్తిగా చూస్తున్నారు.
టైటిల్, ఫస్ట్ లుక్‌తో పాటు...
'SSMB29' మూవీ నుంచి ఇప్పటికే పృథ్వీరాజ్ సుకుమారన్‌ను విలన్ 'కుంభ'గా... మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా రోల్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఫస్ట్ లుక్స్ రివీల్ చేశారు రాజమౌళి. అయితే, అసలు ఘట్టం మహేష్ బాబు ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను 'GlobeTrotter' ఈవెంట్‌లో రివీల్ చేయనున్నారు. దీంతో పాటే మూవీకి సంబంధించిన వరల్డ్‌ను పరిచయం చేస్తూ విజువల్స్ కూడా వస్తాయని అనౌన్స్ చేశారు రాజమౌళి. దాదాపు 100 అడుగుల బిగ్ స్క్రీన్‌పై... టైటిల్‌తో పాటు మహేష్ ఫస్ట్ లుక్, ఈ స్పెషల్ విజువల్ వీడియో ప్లే చేయనున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలోనూ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
Also Read : GlobeTrotter ఈవెంట్ - తండ్రిని గుర్తు చేసుకుంటూ మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్
సాయంత్రం 7 గంటలకు...
హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో శనివారం రాత్రి 7 గంటలకు ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే మూవీ టీం ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేసింది. పాస్‌ల దగ్గర నుంచీ సర్‌ప్రైజెస్ రివీల్ వరకూ 100 అడుగుల బిగ్ స్క్రీన్‌పై స్పెషల్‌గా ప్లాన్ చేసింది. పాస్ పోర్ట్‌ల రూపంలో వివిధ కలర్స్‌లో పాస్‌లు జారీ చేసిన మూవీ టీం అందులో ఈవెంట్‌కు సంబంధించి ఫుల్ రూట్ మ్యాప్‌తో పాటు సూచనలు సలహాలను పొందుపరిచింది. పాస్ పోర్ట్ రంగును బట్టి వారికి సీటింగ్ కేటాయించారు. ఇక ఈవెంట్‌కు రాలేని వారు ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్'లో సాయంత్రం 7 గంటల నుంచి లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.
ఈవెంట్‌కు సూపర్ స్టార్ మహేష్, రాజమౌళితో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ఆస్కార్ విన్నర్ కీరవాణితో పాటు మూవీ టీం హాజరు కానుంది. మూవీలో మహేష్ పేరు రుద్ర అని తెలుస్తోంది. ఈవెంట్‌కు ప్రముఖ యాంకర్ సుమ యాంకరింగ్ చేయనున్నారు.