Mahesh Babu Remembering His Father Ghattamaneni Krishna : ఎన్నో రోజుల ఎదురుచూపులకు మరికొద్దిసేపట్లో తెర పడనుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబో అవెయిటెడ్ 'SSMB29' నుంచి బిగ్ అఫీషియల్ అప్డేట్ ఈ రోజు రానుంది. ఇప్పటికే సోషల్ మీడియాతో పాటు ఇండస్ట్రీలోనూ అంతా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. 'GlobeTrotter' అంటూ హ్యాష్ ట్యాగ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలో మహేష్ తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

Continues below advertisement


శనివారం కృష్ణ వర్థంతి సందర్భంగా తన తండ్రిని గుర్తు చేసుకున్నారు మహేష్ బాబు. 'నాన్నా... ఈ రోజు నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాను. మీరుంటే చాలా గర్వపడేవారు.' అంటూ తండ్రితో తన చిన్ననాటి ఫోటో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. ఈవెంట్‌లో మహేష్ ఏం మాట్లాడతారా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.






Also Read : GlobeTrotter... 16 ఏళ్ల క్రితమే మూవీ ఫిక్స్... 'SSMB29' గురించి ఈ విషయాలు తెలుసా?


ఇక 'GlobeTrotter' ఈవెంట్ కోసం హైదరాబాద్‌లో రామోజీ ఫిల్మ్ సిటీ రెడీ అయ్యింది. వేల మంది పోలీస్, ప్రైవేట్ బందోబస్త్ మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈవెంట్ పర్ఫెక్ట్‌గా నిర్వహించేందుకు మూవీ టీం ప్లాన్ చేసింది. ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళితో, పాటు మహేష్ బాబు వీడియోల ద్వారా అభిమానులకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. పాస్‌లు ఉన్న వారికే ఎంట్రీ ఉంటుంది. పాస్ పోర్ట్ రూపంలో ఉన్న పాస్‌ల రంగును బట్టి వారికి వేర్వేరు గేట్స్ నుంచి ఈవెంట్‌కు ఎంట్రీ ఇస్తారు.


7 వేల కి.మీలు దాటి


హాలీవుడ్ స్థాయిలో '#SSMB29' రూపొందుతుండగా... మహేష్ ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ గ్లింప్స్ కోసం ఫ్యాన్స్‌తో పాటు యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వారి సస్పెన్స్‌కు తెర పడనుంది. 'GlobeTrotter' ఈవెంట్ కోసం దేశ విదేశాల నుంచి ఎందరో హైదరాబాద్ చేరుకుంటున్నారు. సునీల్ అనే ఓ అభిమాని మహేష్ ఈవెంట్ కోసం సింగపూర్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత మహేష్ మూవీ ఈవెంట్ కోసం వస్తున్నానని... 6,817 కిలోమీటర్లు దాటి ప్రయాణం చేశానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.


ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ దీన్ని రీట్వీట్ చేశారు. 'ఒక తెలుగోడు మాత్రమే గర్వంగా భావించే ఎమోషన్ ఇది. అభిమానానికిి ఆకాశం కూడా హద్దు కాదు.' అంటూ రాసుకొచ్చారు.