మాస్... మమ మాస్... సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)ను మాంచి మాస్ అవతారంలో ప్రజెంట్ చేస్తున్నారు మాటల మాంత్రికుడు & గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). ఇప్పటి వరకు విడుదల చేసిన ఒక్కో స్టిల్ మహేష్ & ఘట్టమనేని అభిమానులను మాత్రమే కాదు... సగటు సినిమా ప్రేక్షకులను సైతం అమితంగా ఆకట్టుకుంటున్నాయి. మంగళవారం విడుదల కాబోయే వీడియో గ్లింప్స్ మీద అంచనాలు పెంచాయి. 


'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్
మే 31న మహేష్ బాబు తండ్రి, దివంగత సూపర్ స్టార్ కృష్ణ జయంతి (Krishna Jayanthi 2023). తన తండ్రి జన్మదినం సందర్భంగా ప్రతి ఏడాది తన సినిమాకు సంబంధించిన ఏదో ఒక కొత్త కబురు చెప్పడం మహేష్ బాబుకు అలవాటు. ఈ ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న తాజా సినిమా వీడియో గ్లింప్స్ విడుదల చేయనున్నారు. దానికి టైం ఫిక్స్ చేశారు. 


మే 31వ తేదీ సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాలకు 'మాస్ స్ట్రైక్' పేరుతో మహేష్ - త్రివిక్రమ్ తాజా సినిమా SSMB28 వీడియో గ్లింప్స్ విడుదల చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తెలిపింది. తమన్ నేపథ్య సంగీతం 'మాస్ స్ట్రైక్'లో హైలైట్ కానుందని టాక్. 


Also Read : ప్రభాస్ కంటే శ్రీ రాముని పాత్రకు ఆ హిందీ హీరోలు బెటరా?






కృష్ణ జయంతి సందర్భంగా 'మోసగాళ్ళకు మోసగాడు' చిత్రాన్ని 4K ఫార్మెటులో రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రదర్శించనున్న అన్ని థియేటర్లలో ఈ వీడియో గ్లింప్స్ విడుదల కానుంది. అభిమానులే అతిథులుగా, వాళ్ళ సమక్షంలో విడుదల చేస్తున్నారన్నమాట.


Also Read  : ద్యావుడా - పవన్ షూ కంటే సమంత చెప్పుల రేటు డబుల్!


ఈ సినిమా టైటిల్ ఏంటి?
మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాకు 'అమరావతికి అటు ఇటు', 'గుంటూరు కారం' టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని కొన్ని రోజులుగా వినబడుతోంది. ఇప్పుడు కొత్తగా 'ఊరికి మొనగాడు' టైటిల్ రేసులోకి వచ్చింది. మహేష్ తండ్రి కృష్ణ ఘట్టమనేని హీరోగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన సినిమా టైటిల్ ఇది. ఇప్పటి వరకు ఐదారు టైటిల్స్ వినిపించాయి. మరి, మహేష్ & త్రివిక్రమ్ చివరకు ఏ టైటిల్ ఫిక్స్ చేశారో?


'అ' అక్షరంతో మొదలయ్యే పేర్లకు కొన్నాళ్లుగా త్రివిక్రమ్ ప్రాముఖ్యం ఇస్తూ వస్తున్నారు. అది ఆయన సెంటిమెంట్. మరి, ఈసారి ఆ సెంటిమెంట్ పక్కన పెడతారా? మహేష్ బాబు ఏ పేరుకు ఓటు వేస్తారు? ఈ మూడు పేర్లు కాకుండా కొత్త పేరు ఏదైనా ఫిక్స్ చేస్తారా? అనేది చూడాలి. 


మహేష్ బాబు సరసన పూజా హెగ్డే, శ్రీ లీల కథానాయికలుగా నటిస్తున్న చిత్రమిది.  ఇందులో జగపతి బాబు సైతం కీలక పాత్ర చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం మీద సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. నవీన్ నూలి ఎడిటర్ కాగా... ఎఎస్ ప్రకాష్ కళా దర్శకత్వం వహిస్తున్నారు.