Sreeleela Visit Tirumala: సినీ సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా వారిపై ప్రేక్షకుల ఫోకస్ ఎప్పుడూ ఉంటుంది. ఆఖరికి వారు దేవాలయాలకు వెళ్లినప్పుడు కూడా చుట్టూ ఉన్నవారంతా వారి ఫోటోలు, వీడియోలు తీయడానికి సిద్ధంగా ఉంటారు. అలా వారు చేసే ప్రతీ పనిని అందరూ హైలెట్ చూసి చూస్తారు. తాజాగా శ్రీలీల, తమన్ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఇప్పటికే శ్రీలీల హీరోయిన్‌గా నటించిన పలు చిత్రాలకు తమన్ సంగీతాన్ని అందించాడు. అలా వీరిద్దరి మధ్య చనువు ఉంది. తాజాగా వీరిద్దరికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుండగా.. అందులో తమన్ ప్రవర్తనను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.


మరోసారి ట్రోలింగ్..


తాజాగా శ్రీలీల.. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లింది. తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అప్పుడే తమన్ కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలలో ఉన్నాడు. అలా వీరిద్దరూ అక్కడే కలిశారు. కలిసిన తర్వాత కాసేపు శ్రీలీలతో పాటు తన ఫ్యామిలీతో కూడా మాట్లాడాడు తమన్. అదే సమయంలో శ్రీలీ బుగ్గను గిల్లాడు తమన్. అది చూసి తన చుట్టూ ఉన్నవాళ్లు మాత్రమే కాదు.. నెటిజన్లు కూడా షాకయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే తమన్‌పై ఎప్పటికప్పుడు ఏదో ఒక ట్రోల్ జరుగుతూనే ఉండగా.. అందులో ఇది కూడా యాడ్ అయ్యింది.






పాట సక్సెస్..


చివరిగా శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ‘గుంటూరు కారం’ సినిమాకు తమనే సంగీతాన్ని అందించాడు. అందులో ప్రతీ పాట సూపర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ‘కుర్చీ మడతపెట్టి’ పాట అయితే సూపర్ హిట్ అయ్యింది. ఆ పాటకు తమన్ అందించిన మ్యూజిక్‌ను డామినేట్ చేసేలాగా మహేశ్ బాబు, శ్రీలీల స్టెప్పులేశారు. ఇక ఆ పాట గురించి, సినిమాలో తన సంగీతం గురించి అప్పట్లో తమన్‌పై ప్రశంసలు కురిపించింది శ్రీలీల. ప్రస్తుతం దాదాపు అరడజను సినిమాలకు సంగీతం అందించడంలో బిజీగా ఉన్నాడు తమన్. అందులో చాలావరకు స్టార్ హీరోల సినిమాలు, ప్యాన్ ఇండియా మూవీసే ఉండడం విశేషం.


అదే నమ్మకం..


తిరుమలలో స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న మీడియాతో ముచ్చటించింది శ్రీలీల. ‘‘ఈరోజు మా అమ్మమ్మ పుట్టినరోజు. అందుకే కుటుంబం అంతా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. దర్శనం బాగా జరిగింది. దర్శించుకునే అదృష్టం మాకు కలిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మామూలుగా ఒక పని ప్రారంభించే ముందు లేదా పూర్తయిన తర్వాత మా అందరికీ తిరుపతి రావడం అలవాటు, నమ్మకం’’ అని చెప్పింది. తరువాతి ప్రాజెక్ట్స్ గురించి అడగగా.. తాజాగా ‘రాబిన్‌హుడ్’ మూవీ గురించి అనౌన్స్ అయ్యిందని, అలాగే త్వరలోనే మరిన్ని ప్రాజెక్ట్స్ గురించి అనౌన్స్‌మెంట్స్ వస్తాయని క్లారిటీ ఇచ్చింది ఈ భామ.



Also Read: మా నాన్న నన్ను నమ్మి ఎప్పుడూ ఖర్చుపెట్టలేదు, ‘పుష్ప’పై ఉన్న హైప్ చాలు - అల్లు శిరీష్